హైపర్ ఆది, అభి, వెంకీ-తాగుబోతు రమేశ్, చలాకీ చంటి టీమ్ లీడర్లుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఎంటర్‌టైన్‌మెంట్ షో 'జబర్దస్త్'. అనసూయ వ్యాఖ్యాతగా రోజా, మనో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షో ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తోంది.
వచ్చేవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. హైపర్ ఆది స్కిట్ కోసం అభి, బుల్లెట్ భాస్కర్, నరేశ్ స్టేజ్‌పై మెరిశారు. భాస్కర్‌ను చూపించిన నరేశ్.. 'ఇతనే మా గురువుగారు' అని చెప్పగానే.. అభి వేసిన ప్రశ్నకు.. 'ఎందుకులే అన్నా.. నేను గురువుగారు అంటాను. నువ్వు వెంటనే గురువుగారు గురువుగారు అంటూ గుండెలపై తన్నావు అంటావు' అంటూ ఆది వేసిన పంచులతో అందరూ నవ్వులు పూయించారు. వరుస పంచులు, స్కిట్‌లతో కడుపుబ్బా నవ్వుకున్న న్యాయనిర్ణేతలు.. స్కిట్ అనంతరం వెంకీ కన్నీరు పెట్టుకోవడం వల్ల ఆశ్చర్యపోయారు.