తెలంగాణ

telangana

ETV Bharat / sitara

థియేటర్లు తెరుచుకున్నాయ్.. మరి ప్రేక్షకులు వస్తారా?

దాదాపు తొమ్మిది నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకోనున్నాయి. తొలి సినిమాగా సాయితేజ్​ 'సోలో బ్రతుకే సో బెటర్​' శుక్రవారం(డిసెంబరు 25) నుంచి అలరించనుంది. మరి ఓటీటీలకు అలవాటు పడిన ప్రజలు.. ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో?

cinema theatres re-opening on friday in the telugu states with a new movie
థియేటర్లు తెరుచుకున్నాయ్.. మరి ప్రేక్షకులు వస్తారా?

By

Published : Dec 24, 2020, 10:17 PM IST

కరోనా వైరస్​.. గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న పేరు. ఈ మహమ్మారికి భయపడి దేశాలన్నీ లాక్​డౌన్​ ప్రకటించాయి. భారత్​లోనూ మార్చి నెలాఖరు నుంచి కేంద్రప్రభుత్వం లాక్​డౌన్​ విధించింది. దీంతో దేశంలోని అన్ని కార్యకలాపాలతో పాటు చిత్రపరిశ్రమకూ బ్రేక్​ పడింది. అప్పటి నుంచే థియేటర్లకు, ప్రేక్షకుడికి కొంతమేర దూరం పెరిగింది. సినిమాలకు బాగా అలవాటు పడిన సగటు అభిమాని.. కాలక్షేపం కోసం టీవీలు, ఓటీటీల బాట పడ్డాడు. అందులోని రియాలిటీ షోలకు, వెబ్​సిరీస్​లకూ వరుసపెట్టి చూశాడు. అలా థియేటర్​ ముఖం చూడకుండానే తొమ్మిది నెలలు గడిపేశాడు.

ఆ తర్వాత దేశంలో కరోనా ఆంక్షలు తొలగిస్తున్న క్రమంలో అన్నీ కార్యకలపాలు కొద్దికొద్దిగా ప్రారంభమయ్యాయి. సడలింపుల్లో భాగంగా ఇటీవలే థియేటర్లు తెరిచేందుకు అనుమతి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్కటిగా సినిమాహాళ్లు తెరుచుకోవడం మొదలుపెట్టాయి. పూర్తిస్థాయిలో శుక్రవారం(డిసెంబరు 25) నుంచి ఓపెన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలను విడుదల చేస్తున్నారు. మరి ప్రేక్షకుడు అంతకు ముందులా వస్తాడా? థియేటర్ సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనున్నారు?

థియేటర్లలో ప్రేక్షకులు (పాత చిత్రం)

పెద్ద సినిమాల సందడి లేదు

కరోనా పుణ్యమా అంటూ అప్పుడే డిసెంబరు నెలఖారుకు చేరుకున్నాం. రాబోయేది సంక్రాంతి సీజన్.. ఇంటిల్లిపాది సినిమాలకు వెళ్లే సమయమది. చిత్ర పరిశ్రమకు భారీగా లాభాలను తెచ్చిపెట్టే పండగ ఇదే. ఏటా ముగ్గుల పండక్కి పెద్ద సినిమాలతో థియేటర్లు సందడిగా మారేవి. కానీ, ఈ సారి మాత్రంలో బరిలో పెద్ద హీరోల చిత్రాలు లేకపోవడం చిన్న సినిమాలకు కలిసొచ్చే సమయం. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

'సోలో బ్రతుకే సో బెటర్​' రిలీజ్​ పోస్టర్​

థియేటర్​కు వెళతారా?

దాదాపు తొమ్మిది నెలల తర్వాత తెలుగు చిత్రపరిశ్రమ నుంచి తొలి సినిమా విడుదల అవ్వబోతోంది. అదే మెగాహీరో సాయితేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్​'. అయితే ఇన్ని రోజులూ ఓటీటీలకు అలవాటు పడ్డ ప్రేక్షకులు థియేటర్లకు వెళతారా? లేదా? అనేది అందర్ని తొలుస్తున్న ప్రశ్న. ప్రేక్షకుడ్ని తిరిగి థియేటర్​కు రప్పించేందుకు సినిమాహాల్​ యాజమాన్యాలు, ఇండస్ట్రీ ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. ఇంతకు ముందులాగే థియేటర్​కు వచ్చి హ్యాపీ సినిమా చూసి వెళ్లొచ్చని చెబుతున్నారు. అసలే కరోనా భయంతో ఉన్న సగటు ప్రేక్షకుడు సినిమాహాల్​కు వెళ్లడానికి ఆసక్తి చూపుతాడా? సంక్రాంతి పండగకు ఇంటిల్లిపాది సినిమాకు వెళ్లే అనుభూతిని, సీటుకు సీటుకు మధ్య గ్యాప్​తో పొందుతాడా? లేదా? అనేది ప్రశ్నార్థకం.

అయితే ఇన్ని నెలలు థియేటర్​కు దూరంగా ఉన్న ప్రేక్షకుడిని రప్పించేందుకు సినీప్రముఖులు తగిన ప్రచారం చేస్తున్నారు. లాక్​డౌన్​ తర్వాత విడుదల కాబోతున్న తొలిచిత్రాన్ని సినీ ప్రేమికులు థియేటర్​కు వచ్చి ఆస్వాదించాలంటూ ప్రజలను కోరుతున్నారు. 'సోలో బ్రతుకే..' చిత్రాన్ని చూడమంటూ అగ్ర కథానాయకులు చిరంజీవి, మహేశ్​ బాబు, అల్లు అర్జున్​, వరుణ్​ తేజ్​ లాంటి వారు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. థియేటర్​కు ఎంతమంది ప్రేక్షకులు వస్తారో చూడాల్సిఉంది.

ఇదీ చూడండి:ట్రైలర్: సాయితేజ్ 'సోలో'గా మెప్పిస్తాడా?

ABOUT THE AUTHOR

...view details