లాక్‌డౌన్ వేళ పొట్టకూటి కోసం చాలామంది తిప్పలు పడుతున్నారు. మనకు రోడ్లపై కనిపించేవారే కాకుండా మరెంతో మంది భోజనానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్యాన్స్‌నే నమ్ముకుని ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు వచ్చిన డ్యాన్సర్లదీ అదే పరిస్థితి. వారంతా ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు లేక టీవీ షోలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలా.. లాక్‌డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ప్రముఖ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ అండగా నిలబడ్డారు. నిత్యావసర సరకుల కోసం తనను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాలో ఓ వీడియో పంచుకున్నారు.
డ్యాన్సర్లకు అండగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ - dhee శేఖర్ మాస్టర్
హైదరాబాద్లో ఉన్న పలువురు డ్యాన్సర్లు, కరోనా వల్ల పనిదొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు తనను సంప్రదిస్తే తగిన ఏర్పాటు చేస్తానని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అన్నారు. ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని.. గ్రూప్ డ్యాన్సర్లు, టీవీ షోలు చేసే డ్యాన్సర్లకు పని దొరకడం కష్టంగా మారిందన్నారు. ఏదైనా కార్యక్రమాలు, టీవీ షోలు జరిగితే తప్ప వాళ్లకు పని ఉండదని ఆయన చెప్పారు. భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్న డ్యాన్సర్లు చాలామంది ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి వారు ఎవరున్నా తనను సంప్రదించాలని సూచించారు. వారికి తమ టీమ్ కావాల్సిన సరకులు అందిస్తుందని ఆయన చెప్పారు. ఇందుకోసం ఆయన కొన్ని ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచారు. అలాగే ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవని.. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని, ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.