రియల్‌స్టార్ శ్రీహరి కొన్నివేల మందికి దానాలు చేశారని నటుడు పృథ్వీరాజ్ అన్నారు. ఆపదలో ఉన్నామంటూ ఎవరైనా తన ఇంటిముందుకు వస్తే శ్రీహరి బాల్కనీలో నిల్చొని డబ్బుకు రాయికట్టి దానిని గుడ్డలో చుట్టి రోడ్డుపైకి విసిరేసేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.
'ఆ నటుడు బాల్కనీ నుంచి డబ్బులు విసిరేవారు' - క్యాష్ ప్రోమో ఉదయ్ కిరణ్
క్యాష్ ప్రోగ్రాం లేటేస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. రియల్ స్టార్ శ్రీహరి గురించి నటుడు పృథ్వీరాజ్.. ఉదయ్‌కిరణ్ గురించి బెనర్జీ చెప్పారు. ఉదయ్‌తో తనకున్న అనుబంధాన్ని బెనర్జీ పంచుకున్నారు.
ఈటీవీలో సుమ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే 'క్యాష్' కార్యక్రమంలో హాస్యనటులు పృథ్వీరాజ్, బెనర్జీ, సుదర్శన్, జ్యోతి పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఉదయ్‌కిరణ్ గురించి బెనర్జీ మాట్లాడుతూ.. "ఉదయ్‌కిరణ్ మరణం ఒక విధి. లవర్‌బాయ్‌గా మంచి ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత ఎక్కడో ఏదో తప్పు జరిగింది. 'నీకు పెళ్లైంది.. నీకు ఒక భార్య వచ్చింది. సినిమాలు చేస్తున్నావు.. జీవితాన్ని ఎంజాయ్ చెయ్' అని నేను చెప్పేవాడిని. కానీ.. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది' అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సుమ తనదైన పంచులతో అలరించగా కమెడియన్లు డైలాగ్‌లు, టాస్క్‌లతో సందడి చేశారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి కార్యక్రమం జూన్ 12న ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటి వరకూ ఈ ప్రోమో చూసేయండి.