సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న వీక్లీ షో 'క్యాష్' (cash programme). యాంకర్ సుమ అదిరిపోయే పంచ్‌లు, కంటెస్టెంట్లను ఆటపట్టించే విధానం, ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయడం వంటి విషయాల్లో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ టాప్ షోగా కొనసాగుతోంది. తాజాగా ఈ వారం జబర్దస్త్ కమెడియన్లు ఆది, రాంప్రసాద్‌తో పాటు నటీమణులు భాను శ్రీ, దీపికా పిల్లి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు.
cash: ఆదికి లవ్ ప్రపోజల్.. పెళ్లి చేస్తానన్న రాంప్రసాద్ - క్యాష్‌లో దీపికా పిల్లి
సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'క్యాష్' (cash show) వీక్లీ షోకు ఈ వారం అతిథులుగా విచ్చేశారు ఆది, రాంప్రసాద్, భాను శ్రీ, దీపికా పిల్లి. సుమ అల్లరికి తోడు వీరి పంచ్‌లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

క్యాష్
ఈ ఎపిసోడ్లో భాగంగా అత్తారింటికి దారేది, అమ్మమ్మ గారి ఇంట్లో సందడి పేరడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. సుమ హైపర్ డైలాగ్స్‌కు.. ఆది, రాంప్రసాద్ ఆటో పంచ్‌లు అలరిస్తున్నాయి. షోలో పాల్గొన్న ఓ అమ్మాయి ఆదికి లవ్ ప్రపోజ్ చేసింది. దీంతో అక్కడే ఉన్నరాంప్రసాద్ వీరిద్దరికీ పెళ్లి చేస్తాననడం వల్ల నవ్వులు విరిశాయి. ఈ ఎపిసోడ్ నేటి (మే 29) రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. అప్పటివరకు ఈ ప్రోమో చూసి నవ్వుకోండి.
క్యాష్ ప్రోమో