నాగార్జున వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న తెలుగు రియాల్టీ షో 'బిగ్‌బాస్ సీజన్5'(bigg boss telugu5). రెండో వారానికి సంబంధించి నామినేషన్(bigg boss telugu 5 elimination) ప్రక్రియ సోమవారం జరిగింది. ప్రస్తుతం ఇంటిలో 18 మంది సభ్యులు ఉండగా.. ఊల్ఫ్, ఈగల్ టీమ్‌లుగా విడిపోవాలని బిగ్‌బాస్ ఆదేశించారు.
టీమ్ ఊల్ఫ్‌లో మానస్, సన్నీ విజయ్, కాజల్, శ్వేత వర్మ, లహరి, రవి, నటరాజ్, జస్వంత్, ఉమాదేవిలు ఉండగా, టీమ్ ఈగల్‌లో లోబో, శ్రీరామ చంద్ర, సిరి, ప్రియాంక, ప్రియ, అనీ మాస్టర్, హమీదా, విశ్వ, షణ్ముకలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎదుటి టీమ్‌లో ఉన్న ఇద్దరు సభ్యులను ఎంపిక చేసుకుని వాళ్లు హౌస్‌లో ఉంటానికి ఎందుకు అర్హులు కారో సరైన కారణాలు చెబుతూ, వాళ్ల ముఖానికి ఎరుపు రంగు పూయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు.