రవి, సన్నీలను రాకుమారులుగా ప్రకటిస్తూ బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో బుధవారం విడుదల చేసిన ప్రోమో ఈ టాస్క్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది. హౌస్‌మేట్స్ ఎవరివైపు ఉండాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. ఎక్కువమంది రవిని సపోర్ట్ చేస్తుండగా.. "నువ్వు నేనూ సన్నీ వైపు వెళ్తే అతడు గెలుస్తాడు" అంటూ కాజల్, సిరి మాట్లాడుకున్నారు. సిరిని మద్దతు కోరేందుకు రవి వెళ్లగా, ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూసి, 'నీ సీరియల్ యాక్టింగ్‌లు ఇక్కడ చేయకు' అని సుతిమెత్తగా హెచ్చరించాడు.
'బిగ్‌బాస్' హౌస్ కెప్టెన్సీ టాస్క్‌లో రణరంగం! - బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్
'బిగ్‌బాస్' హౌస్‌లో పోటీదారుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగినట్లుంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో రవి, సన్నీ పోటీపడుతుండగా.. వారి మద్దతుదారుల మధ్య పెద్ద రచ్చ జరిగినట్లు బుధవారం విడుదల చేసిన ప్రోమో చూస్తే తెలుస్తోంది. మరి టాస్క్‌లో ఎవరు గెలిచారు? ఎవరు కెప్టెన్ అయ్యారు? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే!
ఇక మానస్‌తో రవి మాట్లాడుతూ.. "సన్నీ గురించి నేను ఏమీ చెప్పను కానీ, నువ్వు కెప్టెన్ కావాలి" అని చెప్పగా.. "నీ దగ్గరా ఫైర్ ఉంది.. ఆయన దగ్గరా ఫైర్ ఉంది. దాన్ని బయటకు తీయండి" అని రవికి మానస్ సూచించాడు. ఆ తర్వాత బోర్డుపై కెప్టెన్సీ పోటీదారుల ఫొటోలు పెట్టే టాస్క్ జరగ్గా ఇరు వర్గాల మధ్య మినీ యుద్ధమే జరిగినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఒకరినొకరు తోసుకుంటూ, బోర్డులు కింద పడేశారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. మరి టాస్క్‌లో ఎవరు గెలిచారు? ఎవరు కెప్టెన్ అయ్యారు? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే!
ఇదీ చూడండి..F3 Movie Shooting: 'ఎఫ్-3' షూటింగ్లో బన్నీ సందడి