bigg boss 5 telugu latest promo: అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో.. 'బిగ్‌బాస్ సీజన్-5' రసవత్తరంగా సాగుతోంది. టాప్ 7 కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్‌గా తామే ఉండాలని గట్టి పోటీనిస్తున్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏడుగురిలో ఒకరు నేరుగా ఫినాలే చేరుకునేందుకు 'టికెట్ టు ఫినాలే' (ticket to finale) టాస్క్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు మూడు ఛాలెంజ్‌లు ఇచ్చారు. వాటిలో ఎవరు ఎక్కువ పాయింట్లు గెలుచుకుంటారో వారు.. తొలి ఫైనలిస్ట్‌గా నిలుస్తారు.
bigg boss 5 telugu: బిగ్‌బాస్ బంపర్ ఆఫర్.. నేరుగా ఫైనల్ చేరే ఛాన్స్! - బిగ్‌బాస్
bigg boss 5 telugu latest promo : కంటెస్టెంట్లు నేరుగా ఫైనల్ వెళ్లేందుకు ఓ ఆఫర్ ఇచ్చారు బిగ్‌బాస్. అందుకోసం టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చారు. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే ఎపిసోడ్ చూసేయాల్సిందే.
![bigg boss 5 telugu: బిగ్‌బాస్ బంపర్ ఆఫర్.. నేరుగా ఫైనల్ చేరే ఛాన్స్! bigg boss 5 telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13775327-thumbnail-3x2-yv.jpg)
బిగ్ బాస్ 5 తెలుగు
బిగ్ బాస్ ఇచ్చిన ఎండ్యూరెన్స్ ఛాలెంజ్‌లో భాగంగా పోటీదారులంతా ఐస్‌తో నింపిన టబ్‌లో నిలబడి.. వారికి ఇచ్చిన బాల్స్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారు? మరో రెండు ఛాలెంజ్‌లు ఏంటి? 'ఫినాలే' టికెట్ ఎవరు గెలుచుకున్నారో తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:Bigboss telugu 5: 'ఆ ముగ్గురిలో ఒకరు బిగ్‌బాస్ విన్నర్!'