బిగ్‌బాస్(Bigg boss telugu 5) హౌస్‌లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. నామినేషన్స్‌తో హీటెక్కిన హౌస్‌మేట్స్ తాజాగా ఇంటి కెప్టెన్ అయ్యేందుకు మరోసారి బరిలోకి దిగారు. ఇందులో భాగంగా బిగ్‌బాస్ 'నియంత మాటే శాసనం' అనే టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఒక నియంత సింహాసనం ఉంటుంది. దానిలో ఎవరైతే ముందు కూర్చొంటారో వాళ్లు ఆ రౌండ్‌లో సేఫ్ అవ్వడం సహా నియంతగా వ్యవహరిస్తారు. మిగిలిన ఇంటి సభ్యులు వారిని వారు సేవ్ చేసుకునేందుకు ఒక ఛాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి ఛాలెంజ్‌లో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరు ఇంటి (Bigg Boss 5 Telugu) సభ్యుల్లో ఒకరిని సేవ్ చేయాల్సిందిగా నియంత కుర్చీలో కూర్చొన్న వారిని ఒప్పించాల్సి ఉంటుంది. అలా సేవ్ అయిన వారు కెప్టెన్ పోటీదారులు అవుతారంటూ బిగ్‌బాస్ ఈ టాస్క్‌ను డిజైన్ చేశాడు.
బిగ్‌బాస్ హౌస్‌లో నియంత.. కిందపడ్డ షణ్ముఖ్! - బిగ్ బాస్ తెలుగు
హౌస్‌మేట్స్‌కు మరో అదిరిపోయే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్ (Bigg Boss 5 Telugu). ఇప్పటికే నామినేషన్స్‌తో హీటెక్కిన హౌస్.. ఈ టాస్క్‌తో మరింత ఆసక్తికరంగా మారనుంది. 'నియంత మాటే శాసనం' అనే కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే బిగ్‌బాస్ చూడాల్సిందే.
ఈ సందర్భంగా హౌస్‌మేట్స్ వివిధ టాస్క్‌ల్లో పాల్గొన్నారు. నియంత సింహాసనం ఎక్కిన సిరి 'ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. అమ్మాయిలు వాట్ టు డు.. వాట్ నాట్ టు డు' అని డైలాగ్ చెప్పడం నవ్వులు పూయించింది. 'నేను కెప్టెన్ కావాలనుకుంటున్నా' అని కాజల్(Kajal) అడగ్గా, 'నువ్వు రెండు ఫొటోలు కాల్చేశావు కదా! నువ్వు కెప్టెన్ అయితే ఏం చేసేదానివి’'అని శ్రీరామ్(sri ram) ప్రశ్నించాడు. 'కెప్టెన్ కాజల్ ఫైరింజన్‌లో కూర్చోదు' అని సమాధానం ఇచ్చింది. ఆ సమాధానంతో ఏకీభవించని శ్రీరామ్.. రవిని(Ravi) కాపాడాడు. 'అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే కెప్టెన్ బ్యాండ్ వేసుకోవాలి' అంటూ శ్రీరామ్ మరోసారి తన యాటిట్యూడ్ చూపించాడు. మరి ఈ టాస్క్‌లో ఎవరు విజయం సాధించారు? ఎవరు కెప్టెన్ పోటీదారులు అయ్యారు? చివరకు ఇంటి కొత్త కెప్టెన్‌గా నిలిచింది ఎవరు? తెలియాలంటే ఈ వారం ఎపిసోడ్స్ చూడాల్సిందే!
ఇదీ చూడండి:Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ నుంచి అనీ మాస్టర్ ఎలిమినేట్