బుల్లితెర రియాలిటీ షో 'బిగ్బాస్ సీజన్-4' విజేతగా యువ నటుడు అభిజీత్ నిలిచాడు. 105 రోజుల పాటు సాగిన షోలో బుల్లితెర, వెండి తెర, సామాజిక మాధ్యమాలకు చెందిన 19 మంది కళాకారులు పాల్గొన్నారు. నాగార్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియో కేంద్రంగా ఆదివారం గ్రాండ్ ఫినాలే ఉత్కంఠభరితంగా సాగింది. చివరిరోజు వరకు నిలిచిన ఐదుగురు పోటీదారుల ఎలిమినేషన్లను అతిథులుగా హాజరయిన పలువురు సినీ ప్రముఖులు ప్రకటించారు.
బిగ్బాస్ సీజన్-4 విజేత అభిజీత్ - big boss-4
బిగ్‌బాస్ సీజన్-4 విజేతగా యువ కథానాయకుడు అభిజీత్ నిలిచాడు. నగదుతో పాటు చిరంజీవి చేతుల మీదుగా బిగ్బాస్ ట్రోఫీ, ఓ ద్విచక్రవాహనాన్ని అందుకున్నాడు. రన్నరప్‌గా యూట్యూబర్ అఖిల్ సార్థక్ నిలిచాడు.
ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఇద్దరు మిగిలారు. గ్రాండ్ ఫినాలేకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై విజేతను ప్రకటించారు. బిగ్బాస్ ట్రోఫీని గెలుచుకున్న అభిజిత్.. రూ. 50 లక్షల పారితోషికంతో పాటు ఓ ద్విచక్రవాహనాన్ని చిరంజీవి చేతులు మీదుగా అందుకున్నాడు. రన్నరప్‌గా యూట్యూబర్ అఖిల్ సార్థక్ నిలిచాడు. బిగ్బాస్ నాలుగో సీజన్ విజేతగా నిలిచిన అభిజిత్ హైదరాబాద్ కుర్రాడే. తెలుగులో 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' చిత్రం ద్వారా ఆదరణ పొందిన ఈ యువ నటుడు మరో సనిమాతో పాటు ఓ వెబ్ సిరీస్లోనూనటుస్తున్నాడు.
ఇదీ చూడండి:'గోల్డెన్ గ్లోబ్స్' స్క్రీనింగ్‌లో ఆ మూడు సినిమాలు