తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బిగ్​బాస్​-3 ఎంట్రీపై గుత్తా జ్వాల క్లారిటీ - ntr biggboss

ప్రేక్షకాదరణ పొందిన సెలబ్రిటీ రియాల్టీ షో తెలుగు బిగ్​బాస్​ కొత్త సీజన్​పై చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మూడో సీజ‌న్​లో మాజీ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి గుత్తా జ్వాల అభ్యర్థి​గా వస్తున్నట్లు వదంతులు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా ఆమె ట్విట్టర్​ వేదికగా సమాధానమిచ్చారు.

బిగ్​బాస్​-3 ఎంట్రీపై గుత్తాజ్వాల క్లారిటీ

By

Published : May 26, 2019, 1:05 PM IST

ప్రముఖ రియాలిటీ షో బిగ్​బాస్ సీజ‌న్-3 జులైలో ప్రారంభం కానుంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ సరికొత్త సీజన్​లో బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాల భాగం కానున్నార‌ని కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై జ్వాల ట్విట్టర్​ వేదికగా స్పందించారు. తన గురించి వస్తున్న వదంతుల్లో ఎలాంటి నిజం లేదని, తాను బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఈ షోలో పాల్గొనేందుకు జ్వాలకు అవకాశమిస్తే ఆమె ఎక్కువ పారితోషికం అడిగారని... అందుకు నిర్వాహకులు ఒప్పుకోలేదని సమాచారం. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నేచురల్‌ స్టార్‌ నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మూడో సీజన్​ను నాగార్జున హోస్ట్​ చేయనున్నారు. శ్రీముఖి, వరుణ్‌ సందేశ్‌, వైవా హర్ష, ఆర్జే హేమంత్‌ ఈ షోలో సందడి చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details