తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బిగ్​ బాస్​ 4' టీజర్​ వచ్చేసింది.. - bigboss 4 latest news

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే అభిమాన రియాలిటీ షో 'బిగ్​బాస్ సీజన్​ 4' వచ్చేస్తోంది. తాజాగా, ఇందుకు సంబంధించిన టీజర్​ను నాగార్జున.. అభిమానులతో పంచుకున్నాడు.

BIGBOSS season 4 teaser came
బిగ్​బాస్​

By

Published : Aug 16, 2020, 8:25 AM IST

'మై డియర్‌ ఇంటి సభ్యుల్లారా.. ఇంతకన్నా 100 రెట్ల బెటర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నేను సెట్‌ చేస్తాను. తీయండి రీమోట్లు.. ఫిక్స్‌ అవ్వండి బిగ్‌బాస్‌.. నిజమైన ఎమోషన్స్‌.. అసలైన ఎంటర్‌టైన్‌మెంట్‌' అని అంటున్నారు కింగ్​ నాగార్జున. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'బిగ్‌బాస్‌ సీజన్‌-4'. ఇందుకు సంబంధించిన మొదటి టీజర్‌ను నాగ్‌ అభిమానులతో పంచుకున్నారు.

టీజర్‌లో తాత, తండ్రి, కొడుకులుగా మూడు గెటప్‌లలో నాగార్జున తనదైన శైలిలో అలరించారు. త్వరలోనే ఈ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు బిగ్‌బాస్‌ సీజన్‌-4లో పాల్గొనే వారి జాబితా ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ సీజన్‌లో పాల్గొనే వారికి ముందుగానే కొవిడ్‌-19 పరీక్షలు చేసి, క్వారంటైన్‌కు తరలిస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధరణ అయిన తర్వాతే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనుమతిస్తారు. కరోనా కారణంగా ఈసారి బిగ్‌బాస్‌ను మరింత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎవరెవరు ఈ సారి హౌస్‌లోకి వెళ్తారో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే!

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ను 10 వారాలకు కుదించాలని నిర్వాహకులు భావిస్తున్నారని భోగట్టా. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఈసారి షోలో ఆలింగనాలు, దగ్గరికి తీసుకోవడాలు, కరచాలన చేసుకోవడాలు లాంటివి కనిపించకపోవచ్చని అంటున్నారు. అలాగే కంటెస్టెంట్లు భౌతిక దూరం పాటించే విధంగా టాస్కులు ఉండొచ్చని తెలుస్తుంది. ఫన్నీ టాస్క్‌లతో వీక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు ఒక ప్రత్యేక బృందం పనిచేస్తుందట. కంటెస్టెంట్లకు ఇచ్చే పారితోషికంలో కోత ఉంటుందనే వార్తలూ వినిపిస్తున్నాయి. మరోవైపు దీనిలో పాల్గొనే 16 మందిని క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details