అక్కినేని నాగార్జున(nagarjuna bigg boss 5) వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రసారమవుతున్న తెలుగు రియాల్టీ షో 'బిగ్‌బాస్'. ఇటీవల మొదలైన 'సీజన్ 5'(Bigg Boss Telugu Season 5 vote) ఫుల్‌జోష్‌తో, కంటెస్టెంట్‌ల మధ్య హోరాహోరీ పోరుతో సాగుతోంది. వీకెండ్‌లో అటు హౌస్‌మేట్స్‌తో పాటు, ఇటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు నాగార్జున. ఈసారి ఆ సందడి రెట్టింపు కానుంది. యువ కథానాయకుడు రామ్‌చరణ్(ram charan bigg boss) షోకు విచ్చేసి సందడి చేశారు.
'బిగ్‌బాస్'లో చరణ్.. హౌస్‌మేట్స్‌కు నాగ్ వార్నింగ్! - బిగ్‌బాస్ నాగర్జున కామెడి
'కింగ్' నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్-5లో(Bigg Boss Telugu Season 5 vote) మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్(Ram Charan news) సందడి చేశారు. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్ అల్లరి చేయగా నాగర్జున వారికి వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ నాగార్జునకు కోపం తెప్పించిన విషయమేంటో మీరూ తెలుసుకోండి.

బిగ్‌బాస్
స్టేజ్‌పై ఆయన్ను చూడగానే హౌస్‌మేట్స్ అందరూ లేచి నిలబడ్డారు. దీంతో నాగార్జున 'గుర్తుపెట్టుకుంటా.. నేను వస్తే ఎవరూ లేవలేదు' అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు. తాను లోబోలాగా డ్రెస్ చేసుకుని వచ్చానంటూ చరణ్ అనడం వల్ల నవ్వులు పూశాయి. మరి హౌస్‌మేట్స్ గురించి రామ్‌చరణ్‌కు నాగార్జున ఏం చెప్పారు? చరణ్‌తో కలిసి నటిస్తానన్నది ఎవరు? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే!
ఇవీ చదవండి: