ఆయుష్మాన్ ఖురానా కొత్త చిత్రం టైటిల్ ఖరారైంది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు "ఆర్టికల్15" అనే పేరు ఖరారు చేశారు. సంబంధించిన పోస్టర్ని విడుదల చేశారు. ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు ఆయుష్మాన్.
"మనదేశంలోని సామాజిక రాజకీయాంశాలను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉన్నాను. ప్రస్తుత పరిస్థితుల్ని నిష్పక్షపాతంగా చూపించే చిత్రాలు తీయడం కష్టం. కానీ అనుభవ్ సిన్హా ఈ విషయాలను అర్థం చేసుకున్న దర్శకుడు. ఆయనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది" --ఆయుష్మాన్ ఖురానా, బాలీవుడ్ నటుడు.