ప్రకృతిని నాశనం చేసి ప్రాణవాయువును కొనుగోలు చేసే పరిస్థితి తెచ్చుకోకూడదని ప్రముఖ వ్యాఖ్యాత, సినీ నటి ఉదయభాను చెప్పింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ లోని పార్కులో మూడు మొక్కలు నాటి, పర్యావరణం పట్ల తన బాధ్యత చాటుకుంది. ప్రకృతిపై ప్రేమతో తన ఇద్దరి కుమార్తెలకు భూమి, ఆరాధ్య పేర్లు పెట్టుకున్నట్లు పేర్కొంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ , హరితహారంతో తెలంగాణ పచ్చదనంగా మారిందని సంతోషం వ్యక్తం చేసింది. ప్రముఖ సినీనటి రేణుదేశాయ్ , దర్శకుడు సంపత్ నంది, సీనియర్ హాస్యనటులు బ్రహ్మానందానికి.. ఉదయభాను హరితసవాల్ విసిరింది.
'ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి తెచ్చుకోవద్దు' - viswak sen green india challenge
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటిన ఉదయభాను.. ఈ కార్యక్రమం వల్ల తెలంగాణ పచ్చదనంగా మారిందని ఆనందం వ్యక్తం చేసింది.
ఉదయభాను
Last Updated : Jun 21, 2020, 10:49 AM IST