వయసుతో సంబంధం లేకుండా అటు వెండితెర, ఇటు బుల్లితెరపై సందడి చేస్తున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. వైవిధ్యమైన పాత్రలతో సినిమాల్లో, 'కౌన్ బనేగా కరోడ్పతి' షోతో వ్యాఖ్యాతగా దేశవ్యాప్తంగా అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మరో టీవీషోతో మనల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. మరో టీవీ షోలో? - amitabh news
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. మరో టీవీ షోలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అమెరికన్ రచయిత నవల ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్
అమెరికన్ రచయిత గ్రోగోరి డావిడ్ రాబర్ట్స్ నవల 'శాంతారామ్' ఆధారంగా ఈ షో తెరకెక్కించనున్నారు. యాపిల్ టీవీలో ప్రసారం కానుంది. చార్లీ హున్నమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ షోకు జస్టిస్ కుర్జల్ దర్శకుడు. ఇందులో అమితాబ్, రాధిక ఆప్టే నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఖాదర్ ఖాన్ పాత్రలో బిగ్ బీ కనిపించనున్నారు. ముంబయిలోని ధారావిలో వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ జరపనున్నారు.