అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో అల్లు అర్జున్, అల్లు అరవింద్, త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
త్రివిక్రమ్ - అల్లు అర్జున్ సినిమా ప్రారంభం - stylish star
అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. స్టైలిష్ స్టార్ కొత్త సినిమా నేడు హైదరాబాద్లో ప్రారంభమైంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్.
అల్లు అర్జున్
ఈ సినిమాలో పూజా హెగ్డె కథానాయిక. తమన్ సంగీత దర్శకుడు. అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 24 నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.