యాంకర్‌గా, నటిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మి. ఇక హాస్యనటుడిగా 'జబర్దస్త్' వేదికగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు సుధీర్. వీరిద్దరూ ఇటీవల 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా "మీ ఇద్దరిలో ఉత్తమ సింగర్ ఎవరు" అని ఆలీ వారిని ప్రశ్నించగా.. రష్మి బాగా పాటలు పాడుతుందని చెప్పాడు సుధీర్.
సుధీర్-రష్మిలకు అలా పెళ్లి చేశారు! - Alitho saradaga sudheer rashmi
'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరయ్యారు బుల్లితెర పాపులర్ జోడీ రష్మి-సుధీర్. ఇందులో రష్మితో తనకు జరిగిన ఆన్‌స్క్రీన్ పెళ్లి సంఘటనను గుర్తుచేసుకున్నాడు సుధీర్. దీంతోపాటే రష్మి అద్భుతంగా పాటలు పాడుతుందని చెప్పిన అతడు.. తాను మాత్రం చెత్తగా పాడతానని తెలిపాడు.

రష్మి
సుధీర్-రష్మిలకు అలా పెళ్లి చేశారు!
"అహనా పెళ్లంట' కార్యక్రమంలో మా ఇద్దరికి పెళ్లి చేశారు. ఆ సమయంలోనే 'నిన్నే పెళ్లాడతా' సినిమాలోని 'కన్నుల్లో నీ రూపమే' పాటను నాకంటే 200శాతం అద్భుతంగా పాడింది రష్మి. నేను 'అడిగా అడిగా' పాట బాగా పాడా" అని సుధీర్ తమ ఆన్‌స్క్రీన్ పెళ్లి సంఘటనను గుర్తుచేసుకున్నాడు.
ఇదీ చూడండి బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కారుకు ప్రమాదం
Last Updated : Oct 17, 2020, 12:24 PM IST