తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్​లో ఆయన నన్ను నిజంగానే కొట్టారు: నటి పూర్ణిమ - ఆలీతో సరదాగా ప్రోమో

Alitho saradaga latest promo: సింగర్​ కావాల్సిన తను నటిగా మారానని సీనియర్ నటి పూర్ణిమ చెప్పారు. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా గొల్లపూడి మారుతీరావు తనను నిజంగానే కొట్టారని ఆమె వెల్లడించింది.

Alitho Saradaga Poornima
నటి పూర్ణిమ

By

Published : Feb 19, 2022, 5:43 PM IST

Alitho saradaga poornima: సినిమా ఆర్టిస్ట్‌ కావడం వల్ల వచ్చిన ప్రతి సంబంధమూ కుదిరేది కాదని అలనాటి నటి పూర్ణిమ(Poornima) అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి ఆమె విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

తాను తొలుత గాయని అవుదామనుకున్నానని, అయితే, నటిగా మారాల్సి వచ్చిందని పూర్ణిమ చెప్పారు. 'సప్తపది'లో తొలుత అవకాశం వచ్చినా, డ్యాన్స్‌ రాదని తెలిసి అందులో తీసుకోలేదని చెప్పారు. హీరోయిన్‌గా తన పక్కన చేయమని దిగ్గజ నటుడు ఏయన్నార్‌ అడిగేవారని చెప్పుకొచ్చారు.

తన కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అంటే 'శ్రీవారికి ప్రేమలేఖ' అని చెప్పిన పూర్ణిమ.. 'మా పల్లెలో గోపాలుడు' చిత్రంలో 'రాణి రాణమ్మ' పాటను ఒక రాత్రిలో షూట్‌ చేశారని వివరించారు. 'మనిషికొక చరిత్ర' షూటింగ్‌ సందర్భంగా నటుడు గొల్లపూడి మారుతీరావు నిజంగానే తనను కొట్టారని పూర్ణిమ ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details