ఒకరు బుల్లితెరపై.. మరొకరు వెండితెరపై తమదైన నటనతో ఆకట్టుకుంటున్న సోదరులు బాలాదిత్య, కౌశిక్. ఈ ఇద్దరూ కలిసి ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న 'ఆలీతో సరదాగా' (Alitho Saradaga) కార్యక్రమానికి విచ్చేశారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో తమ కెరీర్ ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్ని సినిమాల్లో నటించారు? తదితర విషయాలు పంచుకున్నారు.
Alitho Saradaga: శోభన్ బాబు మెచ్చుకున్నారు - ఆలీతో సరదాగా బాలాదిత్య
ఒకరు బుల్లితెరపై, మరొకరు వెండితెరపై తమదైన నటనతో ఆకట్టుకుంటున్న సోదరులు బాలాదిత్య, కౌశిక్. వీరిద్దరూ ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న 'ఆలీతో సరదాగా' (Alitho Saradaga) కార్యక్రమానికి విచ్చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది.
ఆలీ ప్రశ్నలకు ఈ నటులు చెప్పిన సమాధానాలు నవ్వులు పూయిస్తున్నాయి. మొదటగా ఇండస్ట్రీకి ఎవరు వచ్చారు? అని ఆలీ ప్రశ్నించగా.. నేను అంటూ జవాబిచ్చాడు కౌశిక్. నీది? అని బాలాదిత్యని అడగ్గా '30 ఇయర్స్ ఇండస్ట్రీ ఈ నెలతో' అంటూ సందడి చేశారు. బాల నటుడిగా 6 భాషల్లో 41 చిత్రాల్లో నటించానని చెప్పుకొచ్చారాయన. ఓ సందర్భంలో దివంగత నటుడు శోభన్ బాబు.. మంచి నటుడవుతానని ఓ కాగితంపై రాసి ఆటోగ్రాఫ్ ఇచ్చారని తెలిపారు బాలాదిత్య. ఈ ప్రతిభావంతుల ప్రస్థానం గురించి పూర్తిగా తెలియాలంటే జూన్ 7 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూడండి..