'హైపర్ ఆది'కి ఆ పేరెలా వచ్చిందంటే? - ‘హైపర్’ ఆదికి ఆ టైటిల్ ఎవరు పెట్టారంటే!
తనదైన కామెడీ పంచ్‌లతో నవ్వులు తెప్పించి ఎంతో క్రేజ్ సంపాందించుకున్న నటుడు హైపర్ ఆది. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తోంది వర్షిణి. తాజాగా వీరిద్దరూ 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ప్రోమోను మీరూ చూసేయండి.
తనదైన కామెడీ టైమింగ్, పంచ్‌లతో 'జబర్దస్త్' వేదికగా నవ్వులు పంచి ఎంతో క్రేజ్ సొంత చేసుకున్న నటుడు 'హైపర్' ఆది. వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వర్షిణి. వీరిద్దరూ కలిసి 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. 'హైపర్' అనే టైటిల్ ఎవరు ఇచ్చారో ఈ సందర్భంగా ఆది వెల్లడించారు. దీంతో వర్షిణి నవ్వాపుకోలేకపోయారు. ఇక పెళ్లి గురించి వర్షిణిని ప్రశ్నించగా, తాను ఇలాగే హ్యాపీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. సరదా సరదాగా సాగిపోయే ఈ పూర్తి షోను చూడాలంటే అక్టోబరు 26వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే. అప్పటి వరకూ ఆ నవ్వుల కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను మీరూ చూసేయండి.