తెలంగాణ

telangana

నాన్నే ఇంటినుంచి పారిపోమని చెప్పారు: 'మిర్చి' సంపత్

By

Published : Jan 26, 2022, 9:36 AM IST

Ali tho saradaga promo: 'ఆలీతో సరదాగా' కొత్త ప్రోమో వచ్చేసింది. ప్రతినాయక పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపత్​రాజ్.. తన లైఫ్, కెరీర్​లోని సంగతుల్ని చెప్పారు.

sampath raj
నటుడు సంపత్​రాజ్

Ali tho saradaga sampath raj episode: 'మిర్చి' సినిమాతో విలన్​గా మెప్పించిన సంపత్​రాజ్.. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో పోలీస్, తండ్రి పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ఈటీవీలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన ఆయన తన జీవితాని సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.

'మిర్చి' పాటతో ఎంట్రీ ఇచ్చిన సంపత్.. అలీతో కలిసి డ్యాన్స్​ చేశారు. డ్యాన్స్​లో రిథమ్ బాగుంది, ఐటమ్​సాంగ్స్​ లాంటివి చేస్తారా? అని సంపత్​ను అలీ అడగ్గా.. ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తానని అన్నారు. అమ్మనాన్నల పెళ్లి ఎలా జరిగిందనే విషయాన్ని కూడా వెల్లడించారు.

తాము మొత్తం ఏడుగురు సంతానమని చెప్పిన సంపత్ రాజ్.. తమకు పేర్లకు బదులు వారాల పేర్లు పెట్టుంటే సరిపోయేదని అమ్మతో అనేవాడనని తెలిపారు. ఓ సినిమా కోసం ఓ నటుడితో రెండు నెలలపాటు కపుల్​లా ఓ ఇంట్లో ఉన్నానని కూడా చెప్పారు.

నెక్స్ట్ సినిమాలో ఛాన్స్​ ఇవ్వకపోతే లొకేషన్​కు వచ్చి కెమెరా ఎత్తుకుపోతానని ఓ డైరెక్టర్​ను బెదిరించిన విషయాన్ని సంపత్ చెప్పారు. ఆ దర్శకుడు ఎవరో కూడా వెల్లడించారు. అది కచ్చితంగా చేస్తానని అన్నారు.

'మిర్చి' రిలీజ్​ తర్వాత హైదరాబాద్​లోని శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో జరిగిన సంఘటన గురించి సంపత్​ వివరించారు. ఆర్టిస్ట్ శరణ్య.. తన మాజీ భార్య అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. ఓ సినిమాలో కలిసి నటించడం వల్ల యూట్యూబ్​లో అలా రాసుకొచ్చేశారని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details