'జాతిరత్నాలు' చేసిన తర్వాత తమకు పెళ్లి జరగదని ఫిక్సయిపోయినట్లు కథానాయకుడు నవీన్ పొలిశెట్టి అన్నారు. అలీతో జరిగిన ఈ సరదా సంభాషణ.. ప్రతి సోమవారం ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో జరిగింది.
'ఆలీతో సరదాగా' షోలో 'జాతిరత్నాలు' హంగామా - జాతిరత్నాలు అనుదీప్
ఈటీవీలో 'ఆలీతో సరదాగా' షోకు విచ్చేసిన 'జాతిరత్నాలు' నవీన్, అనుదీప్.. వ్యాఖ్యాత అలీతో కలిసి సందడి చేశారు. ఈ క్రేజీ ఎపిసోడ్ నేడు(మార్చి 22) ప్రసారం కానుంది.
'ఆలీతో సరదాగా' షోలో 'జాతిరత్నాలు' హంగామా
'కినువా' వ్యాపారం ఎలా ఉందని అలీ, నవీన్‌ను అడగ్గా, ఆయన గుక్కతిప్పుకోకుండా చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండతో ఉన్న అనుబంధం, ప్రభాస్‌తో ఉన్న పరిచయం గురించి తన స్టైల్లో ఈ 'జాతిరత్నం' చెప్పుకొచ్చారు. మరో అతిధిగా షోకు విచ్చేసిన డైరెక్టర్ అనుదీప్ తాను చెప్పులు వేసుకోకపోవడానికి గల కారణం ఏంటో నవ్విస్తూ వివరించారు. ఆ విశేషాల కోసం ఈ ప్రోమో చూసేయండి.