తెలంగాణ

telangana

సదాను బాగా ఇబ్బంది పెట్టిన సమస్య అదే..!

By

Published : Sep 2, 2021, 7:50 AM IST

Updated : Sep 2, 2021, 8:20 AM IST

జయం సినిమాలో 'రానురాను అంటూనే చిన్నది' పాటకు డ్యాన్స్​ చేసి మెప్పించింది హీరోయిన్ సదా. అయితే.. ఆమెను ఓ ప్రశ్న బాగా ఇబ్బంది పెట్టింది. అదేంటంటే..

sada
సదా, శ్రద్ధాదాస్

కథానాయికలు రాశి, మహేశ్వరి, శ్రద్ధాదాస్‌, సదా.. ఒక్కచోట చేరితే ఎలా ఉంటుందో 'క్యాష్‌'(Cash Promo latest) కార్యక్రమం చూపించనుంది. సుమ వ్యాఖ్యాతగా ప్రతి శనివారం రాత్రి 9:30 ని.లకు ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ఇది. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలై, విశేషంగా అలరిస్తోంది. కార్యక్రమానికి విచ్చేసిన రాశి, మహేశ్వరి, శ్రద్ధాదాస్‌, సదా తమదైన శైలిలో నవ్వులు పూయించారు. వారితో కలిసి సుమ చేసిన అల్లరి ఆకట్టుకుంటుంది.

సుమ టీ స్టాల్

ఈ కార్యక్రమంలో సుమ(Anchor Suma) కొన్ని చిలిపి ప్రశ్నలు అడిగే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 'సదాగారు మీ కెరియర్‌లో ఇప్పటి వరకు మీకు ఎదురైన ప్రశ్నల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందేంటి?' అని ప్రశ్నించగా 'మీరు పెళ్లి చేసుకుంటే మేం చాలా హ్యాపీగా ఉంటాం' అని అందరు అడుగుతుంటారు అని సదా సరదాగా చెప్తుంది. తర్వాత 'సుమ టీ స్టాల్‌', 'హోమ్‌ టూర్‌' వంటి స్కిట్లతో నలుగురు నాయికలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాని గురించి చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి..

ఇదీ చదవండి:హీరోయిన్​కు వాటర్ ట్యాప్​ అని పేరు పెట్టిన టాప్ డైరెక్టర్​!

Last Updated : Sep 2, 2021, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details