'కెరటం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్'తో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం అగ్రహీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. అయితే తాను పాకెట్ మనీ కోసమే సినిమాల్లోకి వచ్చానని, ఆ తర్వాత ఇండస్ట్రీపై అమితమైన ఇష్టంతో ముందుకు సాగానని స్వయంగా వెల్లడించింది. 'ఆలీతో సరదాగా'(Rakul Preet Singh Alitho Saradaga) షోకు గతంలో హాజరైనప్పుడు దీనితో పాటే పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.
తోటి హీరోయిన్లు రెజీనా, రాశీ ఖన్నాల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టమని వ్యాఖ్యాత అలీ అడగ్గా.. అందరిని ఇష్టపడతానని, ముఖ్యంగా తెలుగు చిత్రసీమ అంతా తన గుండెల్లో ఉందని చెప్పింది. ఎందుకంటే టాలీవుడ్ లేనిదే తాను లేనని బాహాటంగా చెప్పేసింది.
'బాహుబలి'లో చిన్నపాత్రైనా..