తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెలుగు నటీనటులకు ఆ దుస్థితి ఏంటి: కోటా - టాలీవుడ్​ దర్శకనిర్మాతలకు కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి

తెలుగు సినిమాల్లో ప్రాంతీయ నటీనటులకే ప్రాధాన్యం ఇవ్వాలని సీనియర్​ నటుడు కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అవకాశాలు లేక ఆకలితో అలమటిస్తున్న వారికి చేయూతగా నిలవాలని దర్శక నిర్మాతలకు సూచించారు.

Actor Kota Srinivasa Rao Interview in Cheppalani Undi Show
తెలుగు నటీనటులకు ఆ దుస్థితి ఏంటి: కోటా

By

Published : Jan 10, 2021, 5:30 PM IST

టాలీవుడ్​లో తెలుగు నటీనటులకే ప్రాధాన్యం ఇవ్వాలని మన దర్శక నిర్మాతలకు సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. భోజనానికి పూట గడవని నటులు మన పరిశ్రమలో ఉన్నారని.. అలాంటి వారికి అవకాశాలిచ్చి ఆదుకోవాలని సూచించారు. 'ఈటీవీ'లో ప్రసారమవుతున్న 'చెప్పాలని ఉంది' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వ్యక్తిగత విషయాలతో పాటు చిత్రపరిశ్రమ గురించి ఆసక్తికర అంశాల్ని పంచుకున్నారు.

డాక్టర్​ కాబోయి యాక్టర్​గా..

నాటకాల్లో నటించాలనే ఆసక్తి తన అన్నయ్య (నరసింహారావు) ద్వారా వచ్చిందని కోటా చెప్పారు. తనతో పాటు తన తమ్ముడైన శంకరరావుకు ఆయనే గురువు అని తెలిపారు. కృష్ణ జిల్లా కంకిపాడులో తండ్రి డాక్టర్​గా పనిచేశారని.. తాను తండ్రిలా డాక్టర్​ అవ్వాలనుకుని సీటు దొరక్క, బీఎస్సీలో చేరానని వెల్లడించారు.

వారికే ప్రాధాన్యం

టాలీవుడ్​లో తీసే సినిమాల్లో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోటా శ్రీనివాసరావు అన్నారు. పరభాష నటులను తీసుకోవడం వల్ల ఎందరో తెలుగు నటీనటులు అవకాశాలు లేక ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులిచ్చి 'మా' ఆర్టిస్ట్​ అసోసియేషన్​లో సభ్యుడిగా చేరినా సరే అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

తక్కువ బడ్జెట్​తో రూపొందించిన సినిమాలకు ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయని కోటా శ్రీనివాసరావు అన్నారు. అలాంటివి ఇచ్చేముందు తెలుగులో నిర్మించే చిత్రాలలో పాటు తెలుగు ఆర్టిస్టులకు అవకాశం ఇస్తేనే రాయితీలు వర్తించేలా చూడాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

ఆ తప్పులు చేయొద్దు

బీటెక్​ లాంటి పెద్ద చదువులు చదివినా.. సినిమాపై వ్యామోహంతో చాలా మంది పరిశ్రమలో అడుగుపెడుతున్నారని కోటా చెప్పారు. ఆసక్తి లేనప్పుడు అలా చదవడం ఎందుకని ప్రశ్నించారు. ఆ విధంగా డబ్బు, సమయం వృథా అవుతాయని చెప్పారు. ఆసక్తి లేకుండా అలాంటి చదువుల్లో చేరకుంటే.. ఆ సీటుతో మరో అర్హుడికి అవకాశం దక్కేతుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:

కైకాల మాటలతో కన్నీళ్లొచ్చాయి: కోట

'ఇంతమందిని నవ్వించినందుకా మాకీ శిక్ష'

ABOUT THE AUTHOR

...view details