ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు అభిమానులున్నారు. అలాంటి ఈ పాట మరో అరుదైన ఘనత అందుకుంది. యూట్యూబ్‌లో 601 మిలియన్ల(60 కోట్ల) వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా రికార్డు నెలకొల్పింది. అలాగే 3.9 మిలియన్ల లైక్స్తోనూ దూకుకెళ్తోంది.
'బుట్టబొమ్మ'.. ఆ రికార్డు సాధించిన తొలి తెలుగు పాట - అల్లు అర్జున్
'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్ యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతోంది. ఈ ప్లాట్ఫామ్లో 601 మిలియన్ల(60 కోట్ల) పైగా వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా ఘనత వహించింది.
'బుట్టబొమ్మ'.. ఆ రికార్డు సాధించిన తొలి తెలుగు పాట
బన్నీ, పూజ జంటగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. తమన్ తన పాటలతో సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేశారు. మూవీ విడుదలకు ముందే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చిందంటే అందుకు కారణం ఈ సినిమా పాటలే. తమన్ సంగీతానికి అర్మాన్ మాలిక్ గాత్రం, అల్లు అర్జున్ స్టెప్పులు 'బుట్టబొమ్మ'కు ప్రాణం పోశాయి. ఈ పాటతో పాటు 'రాములో రాములో' కూడా యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో కొనసాగుతోంది.
ఇదీ చూడండి:హీరో రానా ఒక్కరోజు ప్రధాని అయితే?