గోవాలో 52వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరగనుంది. నవంబరు 20 నుంచి 28 వరకు ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు తొలిసారి ఓటీటీ నిర్వహకులకు కూడా ఆహ్వానం పంపారు.
మార్టిన్ స్కోర్సెస్, ఇస్తవాన్ జబోకు సత్యజిత్ రే జీవిత సౌఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ వెల్లడించారు. మార్టిన్.. సినీ చరిత్రలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో టాప్‌లో ఉంటారు.
నవంబరులో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం.. ఆసియాలో అత్యంత ప్రాచీన ఫిల్మ్ ఫెస్టివల్. అలానే మన దేశంలోనే అతి పెద్దది. ఈ ఏడాది జనవరిలో 51వ చలనచిత్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించారు.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌కు ఐఎఫ్ఎఫ్ఐ అనుబంధంగా ఉంటుంది. మన దేశంలో, ప్రపంచంలోనే కొన్ని అద్భుత చిత్రాల్ని.. ఈ చలనచిత్రోత్సవాల సందర్భంగా ప్రదర్శించనున్నారు.
ఇవీ చదవండి: