తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కేబీసీలో కోట్లు గెలిచారు.. మరి ఇప్పుడేం చేస్తున్నారు? - kbc contestents who won above 1 crore

హాట్​సీట్​లో కంటెస్టెంట్​లు చెమటలు పట్టించి.. ఆడియన్స్​ మేధస్సుకూ పదును పెట్టిన క్విజ్​ షో 'కౌన్​బనేగా కరోడ్​పతి'. అదేనండి క్లుప్తంగా కేబీసీ. వినోదం, అమితాబ్ యాంకరింగ్​ వల్ల ​కోట్లాది మంది ఆదరణ పొందింది. ఎందరినో కోటీశ్వరులనూ చేసింది. కేబీసీలో విజేతలుగా నిలిచిన 10 మంది పోటీదారులు ఆ డబ్బుని ఏం చేశారు..? ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది..? తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనం చదవండి.

10 KBC Winners And What They Are Doing Right Now With The Money They Won
కేబీసీలో కోట్లు గెలుచుకున్నవారి పరిస్థితి ఇప్పుడేంటి?

By

Published : Jun 17, 2020, 9:00 AM IST

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​ వ్యాఖ్యాతగా.. టీవీ ప్రేక్షకులను కట్టిపడేసిన కార్యక్రమం కౌన్​బనేగా కరోడ్​పతి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఎందరో ప్రతిభావంతులకు ఓ ఆశాకిరణంగా నిలిచిందీ రియాలిటీ షో. ప్రశ్నలు వేసి, కంటెస్టెంట్ల సమాధానాలు లాక్​ చేసి గంటల్లో కొందరిని కోటీశ్వరులను చేసింది. మరి కోట్లు కొల్లగొట్టిన పది మంది కంటెస్టెంట్లు ఇప్పుడెలా ఉన్నారో ఓ లుక్కేయండి...

  • 1.హర్షవర్ధన్​ నవాతే(సీజన్​1)

సివిల్​ సర్వీసు పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కేబీసీలో పాల్గొన్నాడు హర్షవర్ధన్​. తన మేధా శక్తితో కోటి రూపాయలు గెలిచాడు. ఆ తర్వాత తన​ దృష్టి సివిల్స్​ నుంచి ఎంబీఏ వైపు మళ్లింది. అందుకోసం బ్రిటన్​ వెళ్లాడు. ఆ తర్వాత మహీంద్రా కంపెనీలో ఉద్యోగిగా స్థిరపడ్డాడు.

  • 2. రవి సైనీ- కేబీసీ జూనియర్​(సీజన్​ 2)

కేబీసీ జూనియర్​లో కోటి రూపాయలు కొల్లగొట్టిన మొదటి వ్యక్తి రవి. 14 ఏళ్ల వయసులో ఈ కార్యక్రమానికి వచ్చిన రవి.. ఆ డబ్బును చదువుకే వినియోగించాడు. రవి ఇప్పుడో ఐపీఎస్​ ఆఫీసర్​.

  • 3.రాహత్​ తస్లీమ్​(సీజన్​ 4)

కేబీసీలో తన హృదయ విదార గాథను పంచుకుంది రాహత్​. తాను దిగువ మధ్య తరగతికి చెందిన మహిళనని, కుటుంబ సమస్యల కారణంగా చదవు మానేసి.. పెళ్లి చేసుకోవాల్సొ వచ్చిందని తెలిపింది. షోలో కోటీశ్వరురాలైంది. ఇప్పుడు రాహత్​ వస్త్ర దుకాణాన్ని నడుపుతూ, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

  • 4. సుశీల్​ కుమార్​(సీజన్​ 5)

కేబీసీ చరిత్రలోనే రూ.5 కోట్లు గెలుచుకున్న తొలి కంటెస్టెంట్​ సుశీల్​. కానీ, ఆ డబ్బుని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం సుశీల్​ విఫలమయ్యాడు. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాడని సమాచారం.

  • 5.సున్​మిత్​ కౌర్​(సీజన్​ 6)

సున్​మిత్​ కౌర్ ఫ్యాషన్​ డిజైనర్​ అవ్వాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు కేబీసీకి వచ్చింది. ఆ పట్టుదలతోనే అద్భుతంగా ఆడి రూ.5 కోట్లు గెలిచింది. ఇప్పుడు తనకంటూ ఓ బ్రాండ్​ సృష్టించుకొని.. డిజైనర్​గా రాణిస్తోంది.

  • 6. తాజ్​ మహమ్మద్​​​ రంగ్​రీజ్​(సీజన్​ 7)

ఓ సాధారణ ఉపాధ్యాయుుడు తాజ్​ మహ​మ్మద్​. కూతురి కంటి ఆపరేషన్ చేయించాలనే ఆశయంతో కేబీసీకి వచ్చాడు. కోటి రూపాయలు గెలిచి కూతురికి వైద్యం చేయించాడు. అంతే కాదు, ఓ ఇల్లు నిర్మించుకున్నాడు. ఇద్దరు అనాథ యువతులకు తన డబ్బుతో పెళ్లి చేశాడు.

  • 7. అచిన్​ నరులా, సార్థక్​ నరులా(సీజన్​ 8)

క్యాన్సర్​తో బాధపడుతున్న తల్లికి వైద్యం చేయించేందుకు డబ్బు లేక, కేబీసీపై ఆశలు పెట్టుకుని వచ్చారు ఈ అన్నాదమ్ములు. ఈ సీజన్​లో కేబీసీ నగదు బహుమతి రూ.5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయలకు పెంచింది. ఇంకేముంది తల్లిని కాపాడుకోవాలన్న దృఢ సంకల్పంతో ఆడి.. ఆ మొత్తాన్ని కైవసం చేసుకున్నారు. తల్లిని కాపాడుకున్నారు. సొంతంగా వ్యాపారాలు మొదలెట్టారు.

  • 8.అనామిక మజుమ్దార్​(సీజన్​ 9)

అనామిక మజుమ్దార్​ ఓ ఎన్​జీఓ నడుపుతోంది. కేబీసీలో కోటి రూపాయలు గెలిచి.. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతోంది.

  • 9. బినితా జైన్​(సీజన్​ 10)

టెర్రరిస్టుల దాడిలో భర్తను పోగొట్టుకున్న బినితాకు కుమారుడే ప్రపంచమయ్యాడు. అదే సమయంలో కేబీసీలో ఆడే అవకాశం వచ్చింది. కోటి రూపాయలు గెలిచింది. ఆ డబ్బుతో ఓ కోచింగ్​ సెంటర్​ ప్రారంభించి, తన కుటుంబాన్ని ధైర్యంగా ముందుకు నడపుతోంది.

  • 10.సనోజ్​ రాజ్​(సీజన్​ 11)

తాజా సీజన్​లో కోటి రూపాయలు గెలిచిన సనోజ్​ రాజ్​.. ఐఏఎస్​ అవ్వాలన్న తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.

ఇదీ చదవండి:అక్కడ ఇంటర్నెట్​పై నిషేధం- కండోమ్​ల వాడకం నేరం!

ABOUT THE AUTHOR

...view details