అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్ రాగా వారి కుటుంబం మొత్తానికి పరీక్షలు నిర్వహించారు. తాజాగా జయా బచ్చన్‌తో పాటు ఐశ్వర్యా రాయ్‌కు నెగటివ్ అని తేలింది.
జయా బచ్చన్, ఐశ్వర్యా రాయ్‌కు కరోనా నెగటివ్
14:00 July 12
జయా బచ్చన్, ఐశ్వర్యారయ్కి కరోనా నెగటివ్
10:08 July 12
అమితాబ్ నివాసం శానిటైజ్
అమితాబ్, అభిషేక్‌కు కరోనా పాజిటివ్ రావడం వల్ల అప్రమత్తమయ్యారు ముంబయి కార్పోరేషన్ అధికారులు. వారి నివాసం 'జల్సా'ను పూర్తిగా శానిటైజ్ చేశారు.
07:35 July 12
నిలకడగా అమితాబ్ ఆరోగ్యం..
కరోనా సోకిన అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం నిలకడగా ఉందని ముంబయిలోని నానావతీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయనకు తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అమితాబ్.. ఆసుపత్రి ఐసోలేషన్ యూనిట్లో ఉన్నట్లు వెల్లడించారు.
02:27 July 12
మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి స్పందన...
అమితాబ్, అభిషేక్‌కు యాంటిజెన్ పరీక్షలు నిర్వహించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. వారి కుటుంబ సభ్యులు జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కూ పరీక్షలు నిర్వహించామని, వారి ఫలితాలు ఆదివారం ఉదయం వస్తాయని స్పష్టం చేశారు.
00:15 July 12
అభిషేక్ బచ్చన్‌కూ కరోనా..
తన తండ్రి అమితాబ్‌తో పాటు తనకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ వెల్లడించాడు. ఇద్దరకీ స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఆసుపత్రిలో చేరినట్లు స్పష్టం చేశాడు. సంబంధిత అధికారులకు సమాచారమిచ్చి, తమ కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపాడు జూనియర్ బచ్చన్.
ఎవరూ భయపడవద్దని, ప్రశాంతంగా ఉండాలని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు అభిషేక్.
00:09 July 12
దేశమంతా మీ వెనక ఉంది..
అమితాబ్ కరోనా నుంచి వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపారు. "దేశమంతా మీ వెనక ఉంది, మీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తోంది. మీరు జీవితమంతా ఒక యోధుడిలా పోరాడారు. ఈ సమస్యను కూడా అదే సంకల్ప శక్తితో అధిగమిస్తారని భావిస్తున్నా" అని ట్వీట్ చేశాడు యువరాజ్.
23:55 July 11
జాగ్రత్తగా ఉండండి- సచిన్
అమితాబ్ త్వరగా కోలుకోవాలని దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ఆకాంక్షించారు. జాగ్రత్త వహించాలని సూచించారు.
23:53 July 11
మమతా బెనర్జీ..
అమితాబ్‌కు కరోనా పాజిటివ్ రావటం దిగ్భ్రాంతికి గురిచేసిందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఆయన త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
23:48 July 11
త్వరగా కోలుకోవాలి: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
కరోనా నుంచి అమితాబ్ త్వరగా కోలుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఆకాంక్షించారు. అమితాబ్ సూపర్ స్టార్ అని, కోట్ల మందిలో స్ఫూర్తి నింపారని అన్నారు. ప్రభుత్వం సాయంగా ఉంటుందని స్పష్టం చేశారు.
22:52 July 11
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్
దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ముంబయిలోని నానావతి ఆసుపత్రికి తరలించారు. అమితాబ్ కుటుంబంతో పాటు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఆయనతో గత 10 రోజులుగా సన్నిహితంగా ఉన్నవారిని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అమితాబ్ ట్విట్టర్లో కోరారు.