టైటిల్‌తోనే తన సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచే కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. సినిమాలను వేగంగా పూర్తి చేయడంలో యువ కథానాయకులు కూడా ఆయనను అందుకోలేరంటే అతిశయోక్తి కాదు. దర్శకుడు చెప్పిన మాట వేదవాక్కులా పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. అందుకే మాస్‌లో ఆయనకు విపరీతమైన క్రేజ్. ఇక వెండితెరపై డైలాగులు చెప్పడం, యాక్షన్ సీన్లలో ఆయనకు ఆయనే సాటి. ఈ వయసులోనూ ఉరకలెత్తే ఉత్సాహం బాలకృష్ణ సొంతం. అందుకే సెంచరీ సినిమాల తరవాత మరింత జోరు పెంచారు. ఈ ఏడాది తన మూడో సినిమా 'రూలర్'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? 'రూలర్' వెనుక కథేంటి? బాలకృష్ణ ఎన్ని గెటప్‌లలో కనిపించారు? కె.ఎస్.రవికుమార్ టేకింగ్ ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే..
సరోజని నాయుడు(జయసుధ)ఒక పెద్ద కంపెనీకి ఛైర్మన్. అనుకోని పరిస్థితుల్లో అర్జున్ ప్రసాద్(బాలకృష్ణ) ఆమెకు కనిపిస్తాడు. గతం మర్చిపోయిన అర్జున్‌ను తన ఇంటికి తీసుకెళ్లి, కొడుకులా పెంచుతుంది. కంపెనీ బాధ్యతలు అప్పగిస్తుంది. తన తెలివితేటలతో అర్జున్ ప్రసాద్ కంపెనీని నెం.1 స్థానానికి తీసుకెళ్తాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక ప్రాజెక్టు అర్జున్‌ప్రసాద్ కంపెనీకి దక్కుతుంది. అయితే, అక్కడ ప్రాజెక్టు చేపట్ట వద్దని సరోజని చెబుతుంది. గతంలో అక్కడ ప్రాజెక్టు చేపడదామనుకున్న సరోజినీని మంత్రి భవానీనాథ్ ఠాగూర్(పరాగ్ త్యాగి) అడ్డుకుని, అవమానించాడని చెబుతుంది. దీంతో తన తల్లికి అవమానం జరిగిన చోటుకి వెళ్లి, భవానీని, అతని మనుషులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు అర్జున్ ప్రసాద్, అక్కడకు వెళ్లిన అర్జున్‌ను చూసి అందరూ ధర్మ (బాలకృష్ణ) అని పిలుస్తారు? ఇంతకీ ధర్మ అతనెవరు? అతనికీ అర్జున్ ప్రసాద్‌కీ సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే..
బాలకృష్ణ సినిమా అంటే యాక్షన్, ఎమోషన్, డైలాగ్‌లు, ఇవన్నీ ఆశిస్తారు అభిమానులు. పాత్రలో వివిధ గెటప్‌లు ఉంటాయని అనుకుంటారు. అవన్నీ పొందుపరిచిన సినిమా ఇది. 'జైసింహా' కోసం బాలకృష్ణతో పని చేసిన కె.ఎస్.రవికుమార్ ఆయనకు ఏం కావాలో తెలుసు. ఆ అంశాలతో కథను అల్లుకున్నారు. కథానాయకుడు గతం మర్చిపోవడం, అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండటం అన్నది రొటీన్ ఫార్ములా. ఈ సినిమాకు కోసం దాన్నే నమ్ముకున్నారు. ఎప్పుడైతే ఈ నేపథ్యంతో కథ సాగుతుందో సినిమాలోని సన్నివేశాలన్నీ గతంలో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. బాలకృష్ణను జయసుధ చేరదీయడం, ఒక సీఈవోగా మార్చడం వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. సీఈవోగా బాలకృష్ణ విన్యాసాలు, బ్యాంకాక్ సన్నివేశాలు, సొనాల్ చౌహాన్‌తో డ్యూయెట్‌లు తదితర వ్యవహారాలతో ప్రథమార్ధం కథ సాఫీగానే సాగిపోతుంది. షాకింగ్ ఎలిమెంట్స్ ఏవీ ఉండవు. అబ్బుర పరిచే సన్నివేశాలు కూడా ఏవీ రావు. బాలయ్య తనదైన నటన, స్టెప్‌లతో ఫ్యాన్స్‌ను అలరించే ప్రయత్నం చేశాడు. బ్యాంకాక్ సన్నివేశాల్లో కామెడీ అంతగా పండలేదు. అవన్నీ సాగదీతగా అనిపిస్తాయి.
వేదిక రాకతో కథలో మలుపు ఉందన్న సంగతి అర్థమవుతుంది. యూపీ వ్యవహారాలు, రైతుల సమస్య వాటితో కథనం వేగం పుంజుకుంది. ద్వితీయార్ధంలో పోలీస్ పాత్ర ప్రవేశిస్తుంది. ఆ పాత్రను కూడా మాస్‌ను అలరించేలా రూపొందించారు. ద్వితీయార్ధంలో రైతుల సమస్యలతో పాటు, పరువు హత్యలను ప్రస్తావించారు. ప్రథమార్ధం చూసిన ప్రేక్షకుడికి ద్వితీయార్ధంలో మరో సినిమా చూసిన భావన కలుగుతుంది. యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో ఫైట్ తర్వాత ఫైట్ వచ్చి పడిపోతుంటాయి. అవన్నీ అభిమానులను అలరించినా, కుటుంబ ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది కలిగించేలా ఉంటాయి. అర్జున్ ప్రసాద్ ఎవరు? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలిసిన తర్వాత ఒక భారీ క్లైమాక్స్‌తో సినిమాను ముగించారు. పాత కథను కొత్తగా తీయడంలో దర్శకుడు కె.ఎస్. రవికుమార్ తన మార్కు చూపించలేకపోయారు అక్కడక్కడా బాలకృష్ణ తనదైన శైలిలో చేసిన విన్యాసాలు ఊరటను కలిగిస్తాయి.
ఎవరెలా చేశారంటే..