తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఏదైనా రచ్చే మరి.. - culcatta

ఇటీవల కాలంలో ఏ విషయం చెప్పాలన్నా ప్రముఖులు కొంత ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆ చెప్పే విషయాన్ని సోషల్ ​మీడియాలో నెటిజన్లు ఎలా స్వీకరిస్తారా అని భయపడుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి ట్రోల్​లోకి ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ సభ్యసాచి ముఖర్జీ చేరారు.

ఏదైనా రచ్చే మరి..

By

Published : Mar 9, 2019, 6:29 PM IST

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ సభ్యసాచి ముఖర్జీ.. ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉన్న మోడల్​ ఫొటో షేర్​ చేశారు. కింద క్యాప్షన్​గా అందం కన్నా ఆత్మవిశ్వాసం గొప్పదంటూ వ్యాఖ్యానించారు. మహిళలందరూ ఆత్మవిశ్వాసంతో ఈ రోజును సెలబ్రేట్​ చేసుకోవాలని సూచించారు.

  • దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ప్లస్​ సైజ్​ మోడల్​ను తన ప్రదర్శనల్లో ఎప్పడూ చూపించని డిజైనర్​.. ఈరోజు మాత్రం మహిళలపై గౌరవాన్ని ఒలకబోస్తున్నారంటూ వ్యతిరేక వర్గాలు మండిపడుతున్నాయి. కొందరేమో ఇలాంటి మహిళలు తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు.. అలాంటి వారికి ప్రేరణ కోసమే ఈ ఫొటో అని ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.


ABOUT THE AUTHOR

...view details