ప్రముఖ పాప్ సింగర్ లేడీ గగాకు అనుకోని అనుభవం ఎదురైంది. లాస్‌వెగాస్‌లో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో అభిమానితో కలిసి పాట పాడుతూ స్టేజిపై నుంచి కింద పడిపోయింది. అప్పుడు వీడియోలు తీసిన చాలా మంది అభిమానులు, వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ తర్వాత అది వైరల్‌గా మారింది. అనంతరం ఈ విషయంపై స్పందించిందీ గాయని.
పాడుతూ స్టేజిపై నుంచి కిందపడ్డ పాప్ సింగర్ - లేడీ గగా సింగర్
ప్రముఖ పాప్ సింగర్ లేడీ గగా.. లాస్‌వెగాస్‌లోని ఓ కార్యక్రమంలో పాట పాడుతూ స్టేజిపై నుంచి కిందపడిపోయింది. ఆ వీడియో వైరల్‌గా మారింది.

పాప్ సింగర్ లేడీ గగా
"అతడితో పాట పాడటం నిజంగా బాగుంది. అయితే అనుకోకుండా స్టేజిపై నుంచి కింద పడిపోయాం. ఒకరి భుజాలపై ఒకరం పడ్డాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి టీ తాగాం" -లేడీ గగా, పాప్ సింగర్
హెర్ రెసిడెన్సీ సిరీస్‌ను గతేడాది జనవరి 20 నుంచి లాస్‌వెగాస్‌లోని ఎమ్‌జిఎమ్ పార్క్ థియేటర్లో ప్రదర్శిస్తోంది సింగర్ లేడీగగా.