Harish Shankar-Alluarjun Movie: ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్-దర్శకుడు హరీశ్‌శంకర్ కాంబో మళ్లీ రిపీట్ కానుందా? అంటే అవుననే వినిపిస్తోంది. నేడు హరీశ్ చేసిన ట్వీట్ చూస్తే ఇది అర్థమవుతోంది. వీరిద్దరు కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు.
"మనం కలిసినప్పుడల్లా ఎంతో సరదాగా ఉంటుంది. నీతో కలిసి సమయాన్ని గడపటం గొప్పగా ఉంది. లవ్ యు. తగ్గేదే లే.. ఎందుకు తగ్గాలి?" అని ట్వీట్ చేశారు. దీంతో సినిమా చేయడమే కోసమే బన్నీ-హరీశ్ కలిశారని అభిమానులు ఆశిస్తున్నారు. హరీశ్ స్క్పిప్ట్ సిద్ధం చేస్తున్నాడని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.