51వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకలు గోవాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 250 మందికి మించకుండా అన్ని రకాల మార్గదర్శకాలు పాటిస్తూ ఎంతో జాగ్రత్తగా వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బంగ్లాదేశ్ హైకమిషనర్ మహ్మద్ ఇమ్మాన్ హాజరయ్యారు.
గతేడాది జరిగిన స్వర్ణోత్సవాల్లో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుక్ ఖాన్ వంటి అగ్రతారాలు పొల్గొనగా.. ఈ సారి సుదీప్, టిస్కా చోప్రా, మనోజ్ జోషి, ప్రియదర్శన్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఆరంభ వేడుకల్లో భాగంగా ప్రముఖ ఛాయగ్రాహకుడు విట్టోరియో స్టోరారోకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు బిశ్వబిత్ ఛటర్జీకి ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించారు.