బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే.. ట్రాన్స్ఉమన్గా మారారు. ఈ మార్పు తర్వాత తన పేరును సైషాగా మార్చుకున్నట్లు సోషల్మీడియా వేదికగా వెల్లడించారు. ట్రాన్స్ఉమన్గా మారడానికి గల కారణాలను ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు.
"మీ మూలాలతో సంబంధం లేకుండా, మీ బాల్యాన్ని గుర్తుచేసే ఏదో ఒకటి ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. అది నన్ను ఒంటరితనానికి, ఏకాంతంలోకి నెట్టి ఒత్తిడి పెంచడం సహా గందరగోళానికి గురిచేసింది. అందరి కంటే నేను భిన్నంగా ఉండడం వల్ల అబ్బాయిలు అందరూ నన్ను వేధించేవారు. ఆ బాధ ఇంకా నాలోనే ఉంది. నేను అది కాదని తెలుసు. సమాజంలో అలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నా. ఇప్పుడు నేను మళ్లీ పుట్టాను. నేను గే (స్వలింగ సంపర్కుడు) అవ్వడం వల్ల పురుషుల పట్ల ఆకర్షితుడయ్యానని నమ్ముతూ కొన్నేళ్లు గడిపా. కానీ, ఆరేళ్ల క్రితమే నన్ను నేను అంగీకరించుకున్నా. ఈరోజు ఆ విషయాన్నే మిమ్మల్ని అంగీకరించమని చెబుతున్నా. ఇక మీదట నేను గే కాదు. ఇప్పుడు నేను ట్రాన్స్ఉమన్."
- స్వప్నిల్ షిండే, ఫ్యాషన్ డిజైనర్