తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందం తరగని అమ్మలు.. ఆరోగ్యం పెంచుకున్న భామలు!

అమ్మతనాన్ని ఆస్వాదించడాన్ని ప్రతి మహిళా అదృష్టంగా భావిస్తుంది. కానీ, ప్రసవం అయ్యాక ఆమెలో హార్మోన్లు మారిపోతాయి. బిడ్డను చూసుకోవడంలో బిజీ అయిపోయి.. జీవన విధానమే మారిపోతుంది. తనకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోలేక అందం, ఆరోగ్యం రెండింటినీ గాలికి వదిలేస్తుంది. కానీ, తల్లైన తర్వాత కూడా ఆడవారు జీవితంలో ఆరోగ్యంగా ముందుకు సాగొచ్చని నిరూపించారు ఆ బాలీవుడ్​ సూపర్​ మామ్​లు. మరి ఆ అందమైన అమ్మలెవరో చూసేద్దాం రండి..

Bollywood moms who are incredibly fit
అందం తరగని అమ్మలు.. ఆరోగ్యం పెంచుకున్న భామలు!

By

Published : Jun 28, 2020, 12:00 PM IST

తల్లవ్వడం ఆడవారి ఆరోగ్యాలకు శాపం కాదని, మహిళలు తలుచుకుంటే అందాన్ని ఎప్పటికీ కాపాడుకోవచ్చని నిరూపించి... ఎందరో అమ్మలకు ఆదర్శంగా నిలుస్తున్నారు బాలీవుడ్​ ఫిట్​ మామ్​లు. వారెవరో చూసేయండి...

అమ్మయినా.. అందాల శిల్పమే..

అమ్మైనా.. ఆందాల శిల్పమే..

శిల్పాశెట్టి కుంద్రా... 2012లో వియాన్​ రాజ్ కుంద్రాకు జన్మనిచ్చింది. తాజాగా ఈ ఏడాది ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చి రెండో సారి తల్లయింది. కానీ, శిల్పా రోజూ తనకంటూ కాస్త సమయాన్ని కేటాయిస్తుంది. ఆమె వేసే యోగాసనాలు, ఆరోగ్యకర ఆహారపు అలవాట్ల వల్లే.. తల్లయినా ఇప్పటికీ ఆమె ముఖంలో కళ, శరీరాకృతి అప్పటిలాగే ఉన్నాయి.

వయ్యారాల మామ్​ మీరా..

వయ్యారాల మామ్​ మీరా..

మీరా రాజ్​పుత్​ కపూర్​.. 25 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు తల్లయింది. డెలివరీ తర్వాత మారిన శరీరాకృతిని తిరిగి ఎప్పటిలా మార్చేందుకు.. రోజూ భర్త షాహిద్​ కపూర్​తో కలిసి జిమ్​లో వ్యాయామం చేసింది. కొద్దిరోజుల్లోనే మళ్లీ వయ్యారంగా మారిపోయింది.

అరోరా ఎప్పటికీ ఫిట్టేరోయ్​!

అరోరా ఎప్పటికీ ఫిట్టేరోయ్​!

మలైకా అరోరా అందరిలా ఆహార ప్రియురాలు. కానీ, రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎప్పుడూ శరీరాకృతి మాత్రం మారలేదు. తల్లయిన సమయంలో విపరీతంగా లావైపోయింది. కానీ, డెలివరీ తర్వాత యోగా సెషన్లకు కచ్చితంగా హాజరై​ తిరిగి ఫిట్​గా మారిపోయింది.

సైజ్​జీరో మామ్​!

సైజ్​జీరో మామ్​!

ఒకప్పుడు బొద్దుగా ఉన్న కరీనా కపూర్​.. సైజ్​జీరో శరీరాకృతికి బ్రాండ్​ అంబాసిడర్​గా మారింది. ఆపై.. సైఫ్​ అలీ ఖాన్​ను పెళ్లి చేసుకుని.. తైమూర్​ అలీఖాన్​కు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత భారీగా బరువు పెరిగిపోయిన కరీనా.. ఊహించని విధంగా తన వ్యాయామం, సంకల్పంతో మళ్లీ తనదైన జీరోసైజ్​ ఫిజిక్​ సొంతం చేసుకుంది.

ఫిట్​నెస్​ కా కరిష్మా ​

ఫిట్​నెస్​ కా కరీష్మా ​

కరీష్మా కపూర్​.. తన నటనతో బాలీవుడ్​లో రికార్డులు సృష్టించింది. పెళ్లయినా, తల్లయినా ఎప్పటికీ అదే శరీరాకృతితో కనిపిస్తోంది.

సర్ఫింగ్​ బ్యూటీ...

సర్ఫింగ్​ బ్యూటీ...

లీసా హేడెన్​కు సర్ఫింగ్​ అంటే మహా ఇష్టం. ఓ బిడ్డకు అమ్మ అయినప్పటికీ సముద్రంలో సర్ఫింగ్​ చేసి.. ఫిట్​గా ఉన్నానంటోంది.

విశ్వం మెచ్చిన తల్లి..

విశ్వం మెచ్చిన తల్లి..

సుస్మితా సేన్ అందం, ఆత్మవిశ్వాసంతో విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది.​ ఇద్దరు కుమార్తె (దత్తత ద్వారా)లకు తల్లయినా.. తన ఆరోగ్యకరమైన జీవనశైలితో చెక్కు చెదరని అందంతో మెరిసిపోతోంది.

ఇదీ చదవండి:ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ అందాలు అదరహో

ABOUT THE AUTHOR

...view details