బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌కు చాక్లెట్ తినిపించి, ముద్దిచ్చాడు దుల్కర్ సల్మాన్. వీరిద్దరూ కలిసి 'జోయా ఫ్యాక్టర్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి 'ఖష్' టైటిల్‌తో ఓ రొమాంటిక్ వీడియో గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం.
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్, అలిసా మెడోన్సా కలిసిఈ పాట పాడారు. ఈ సినిమాలో జోయా పాత్రలో సోనమ్ నటిస్తుండగా, భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా దుల్కర్ కనిపించనున్నాడు. అంగద్ బేడీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
సినిమా కథేంటి..?
1983లో భారత్ ప్రపంచకప్ గెలిచిన రోజే జోయా(సోనమ్) పుడుతుంది. అందుకే ఆమెను అదృష్ట దేవతగా భావిస్తుంటాడు తండ్రి సంజయ్ కపూర్. కానీ పెద్దయ్యాక ఆమెకు అన్నీ దురదృష్టాలే. ఉద్యోగం పోతుంది. బాయ్‌ఫ్రెండ్ వదిలేస్తాడు. అలాంటి సమయంలో అనుకోకుండా దుల్కర్, జోయా కలుస్తారు. అప్పట్నుంచి అతడికి అదృష్టం కలిసొస్తుంది. ప్రతీసారి 99 పరుగుల వద్ద అవుటయ్యే హీరో...సెంచరీలు బాదేస్తుంటాడు. జోయా స్టేడియంలో ఉంటే భారత జట్టు విజయం ఖాయం అన్నంత పేరొస్తుంది. ఫలితంగా క్రికెటర్ల కన్నా ఆమె ఆటోగ్రాఫ్‌ల కోసమే అభిమానులు ఎగబడుతుంటారు. ఆమెను దేవతలా ఆరాధిస్తుంటారు. అయితే ఓరోజు సోనమ్‌కు, దుల్కర్‌కు గొడవ జరిగి విడిపోయే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ చిత్ర కథాంశం.
'జోయా ఫ్యాక్టర్' పేరుతో అనూజా చౌహన్ రచించిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అభిషేక్ శర్మ. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి...మాస్మహారాజా సరసన శ్రుతిహాసన్ మరోసారి..!