తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెల్​బోర్న్​కు 'గల్లీబాయ్' పయనం - gullyboy

మెల్​బోర్న్​లో జరగనున్న భారతీయ చలన చిత్రోత్సవాల్లో బాలీవుడ్ సినిమా 'గల్లీబాయ్' ప్రదర్శితం కానుంది. ఆగస్టు 8 నుంచి 17 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

గల్లీబాయ్

By

Published : Jun 28, 2019, 8:51 AM IST

Updated : Jun 28, 2019, 1:21 PM IST

రణ్​వీర్ సింగ్ నటించిన 'గల్లీబాయ్' చిత్రం మెల్​బోర్న్​లో జరగనున్న భారతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపికైంది. ఆగస్టు 8 నుంచి 17 వరకు మెల్​బోర్న్​లో పదో ఫిల్మ్​ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఆగస్టు 10న చిత్ర దర్శకురాలు సినిమా గురించి ఆస్ట్రేలియా ప్రేక్షకులతో చర్చలో పాల్గొంటారు.

"భారతీయ సినిమాలు హద్దులు చెరుపుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ కావాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఓ దర్శకురాలిగా ఇది నాకు అరుదైన గౌరవమనే చెప్పాలి. భారతీయ చిత్రోత్సవాలను చూడటానికి ఎంతో ఆతృతగా ఉంది" -జోయా అక్తర్, బాలీవుడ్ దర్శకురాలు.

ఆలియా భట్ హీరోయిన్​గా నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ముంబయి వీధుల్లో పెరిగిన ఓ యువకుడు ర్యాపర్​గా ఎలా ఎదిగాడనేది చిత్ర ప్రధాన కథాంశం. ఈ ఏడాది ఫ్రిబ్రవరిలో సినిమా విడుదలైంది.

ఇది చదవండి: త్వరలో దోస్తానాకు సీక్వెల్.. కార్తీక్ ఆర్యన్ హీరో

Last Updated : Jun 28, 2019, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details