ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ఎంపిక కమిటీ కొత్త సభ్యులుగా వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖుల్ని ఆహ్వానించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. భారతదేశం నుంచి దర్శకులు జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్‌తో పాటు నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 842 మంది కొత్త వారికి ఈ అవకాశం దక్కింది. ఇందులో సగానికి పైగా మహిళలున్నారు. వీరితో పాటే 21 మంది ఆస్కార్ విజేతలు, 82 మంది ఆస్కార్ నామినేషన్ పొందిన వారు ఈ జాబితాలో ఉండటం విశేషం.
బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ 'హోటల్ ముంబయి', 'ది బిగ్ సిక్'తో తనదైన ముద్రవేశారు అనుపమ్ ఖేర్. ఇటీవలే 'గల్లీబాయ్'తో ఆకట్టుకున్నారు దర్శకురాలు జోయా అక్తర్. బాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు అవకాశం దక్కింది.