ప్రతి సంక్రాంతికి అల్లుళ్లొస్తారు.. కానీ ఈ సంక్రాంతికి జాంబీలను తెస్తున్నానంటున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తన దర్శకత్వంలో తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన చిత్రం 'జాంబిరెడ్డి'. తెలుగులో జాంబియా ఫార్మెట్లో రాయలసీమ నేపథ్యంగా తెరకెక్కిన తొలి తెలుగు చిత్రంగా 'జాంబిరెడ్డి' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా 'జాంబిరెడ్డి' ప్రచార చిత్రాన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు.
ట్రైలర్: ఈ సంక్రాంతికి జాంబీలొస్తున్నాయ్ - జాంబిరెడ్డి ట్రైలర్ రిలీజ్
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జాంబిరెడ్డి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. ఆద్యంతం నవ్విస్తూ ఉత్కంఠ రేకెత్తిస్తోందీ ప్రచారచిత్రం.
ట్రైలర్: ఈ సంక్రాంతికి జాంబీలొస్తున్నాయ్
ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ నవ్వించే 'జాంబిరెడ్డి' ప్రచార చిత్రం బాగుందని, సినిమా సంక్రాంతి బరిలో విజయం సాధించాలని ప్రభాస్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
Last Updated : Jan 2, 2021, 7:55 PM IST