'అ!', 'కల్కి' లాంటి వినూత్న చిత్రాలతో అలరించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం 'జోంబీ రెడ్డి' పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు. తాజాగా శనివారం చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ ఓ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం.
మెగాస్టార్ బర్త్‌డే విషెస్‌తో 'జోంబీ రెడ్డి' మోషన్ పోస్టర్ - చిరంజీవి పుట్టినరోజు
'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'జోంబీ రెడ్డి'. శనివారం చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం.
మెగాస్టార్ బర్త్‌డే విషెస్‌తో 'జోంబీ రెడ్డి' మోషన్ పోస్టర్
ఈ సినిమాలో కరోనా నేపథ్య కథాంశం ఉండనున్నట్లు తెలుస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. మార్క్ రాబిన్ సంగీతమందిస్తున్నారు. ఆపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.