టాలీవుడ్లో తొలిసారి జాంబీ నేపథ్య కథతో తెరకెక్కించిన సినిమా 'జాంబిరెడ్డి'. కొన్నాళ్ల క్రితం తొలుత థియేటర్లలో, ఆ తర్వాత ఓటీటీలో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
'జాంబిరెడ్డి'కి సీక్వెల్.. స్క్రిప్ట్ పనుల్లో డైరెక్టర్! - జాంబిరెడ్డి లేటేస్ట్ న్యూస్
జాంబి హాస్యభరిత కథాచిత్రం 'జాంబిరెడ్డి'కి త్వరలో సీక్వెల్ రానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశముంది.

జాంబిరెడ్డి సీక్వెల్
'జాంబిరెడ్డి' చిత్రంలో తేజ, ఆనంది, దక్ష హీరోహీరోయిన్లుగా నటించారు. జాంబి నేపథ్యానికి హాస్యం జోడించడం, సినీ వీక్షకులను నవ్వించింది.