హీరో నాని, నజ్రియా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'అంటే సుందరానికి!'. ఈ సినిమాలో నాని జీరో లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో కేపీవీఎస్ఎస్పీఆర్ సుందర్ ప్రసాద్ అనే పాత్రలో నటిస్తున్నారు నాని. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 2022 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఆకట్టుకునేలా ఫస్ట్‌లుక్..
సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ సినిమా ఫస్ట్‌లుక్ న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైంది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు.
'మార్క్ ఆంటోనీ'గా విశాల్..
నటుడు విశాల్ 33వ సినిమాకు 'మార్క్ ఆంటోనీ' అనే టైటిల్‌ను ఖారారు చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.