తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మనీహైస్ట్'​ తరహా వెబ్​సిరీస్​.. తెలుగులో! - ZEE5 OTT news

ZEE5 New Web Series: 'మనీహైస్ట్​' తరహా వెబ్​సిరీస్​ తెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిని ప్రముఖ ఓటీటీ జీ5 నిర్మించబోతుంది. ఈ మేరకు ఉత్కంఠభరితమైన ఓ పోస్టర్​ను విడుదల చేసింది జీ5 యాజమాన్యం.

ZEE5 New Web Series
ZEE5 New Web Series

By

Published : Jan 21, 2022, 3:43 PM IST

ZEE5 New Web Series: 'మనీహైస్ట్‌' నెట్‌ఫ్లిక్స్‌లో ఓ సంచలనం. బ్యాంకు దోపిడి నేపథ్యంలో సాగుతూ థ్రిల్లింగ్​గా ఉండే వెబ్​సిరీస్​ ఇది. ఇందులోని ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. స్నేహం, దోపిడి, భావోద్వోగాలు, పోరాటాలు చూపు తిప్పుకోనివ్వవు. దీంతో అత్యంత ప్రజాధరణ పొందిన వెబ్​సిరీస్​ల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరహా వెబ్​సిరీస్​ తెలుగులో కూడా రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ జీ5.. ఇటువంటి ఓ ​సిరీస్​ను నిర్మిస్తున్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల వేదికగా జీ5 విడుదల చేసిన పోస్టర్​ చూస్తే దీనికి బలం చేకూరుతోంది.

ఉత్కంఠతో కూడిన పోస్టర్‌లో ఐకానిక్​ చార్మినార్​ చిత్రం పైన నలుగురు వ్యక్తుల ఛాయాచిత్రాలు ఉన్నాయి. దీంతో పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తమ ఊహాల్లో మునిగిపోయారు. తమకు తోచిన విధంగా అంచనా వేసేస్తున్నారు. జీ5 ఎలాంటి వెబ్​సిరీస్​ను తీసుకురానుందనని తెగ ఆరాటపడిపోతున్నారు.

"సంపన్నులు, పేదరికానికి మధ్య పోరాటం. నగరంలో ఉన్న నలుగురు దొంగల కథ ఇది. దొంగతనం పక్కా! ఒక విచిత్రమైన దోపిడి! మరిన్ని అప్‌డేట్స్​ కోసం వేచి చూడండి" అని ట్వీట్​ చేసింది. కథ అంతా హైదరాబాద్‌లోని నలుగురు దొంగల గురించి అని తెలుస్తోంది. దీంతో ఈ వెబ్​సిరీస్​లో ప్రముఖలు నటించవచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:ఆస్కార్ రేసులో సూర్య 'జై భీమ్'తో పాటు మరో సినిమా

ABOUT THE AUTHOR

...view details