ఇటీవలే వెంకటేశ్‌తో కలిసి వచ్చి 'వెంకీమామ' చిత్రంతో హిట్ కొట్టిన నాగచైతన్య.. తదుపరి సినిమాపై దృష్టిపెట్టాడు. తాజాగా ప్రముఖ దర్శకుడు పరశురామ్‌తో కలిసి ఓ చిత్రానికి పచ్చజెండా ఊపాడు చైతు. ఎన్సీ20 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీకి రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య - నాగచైతన్య సినిమా తాజా వార్తలు
సోలో, గీతాగోవిందం లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య పనిచేయనున్నాడు. వీరి కాంబినేషన్లో రానున్న ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు.
పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య
ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు నాగ చైతన్య. చైతన్యకు జోడీగా తొలిసారి సాయిపల్లవి నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగచైతన్య ఈ సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడంటూ వినికిడి.
Last Updated : Dec 14, 2019, 7:51 PM IST