దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రముఖ చిత్ర నిర్మాణసంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ ముందుకొచ్చింది. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్(ఎఫ్‌డబ్ల్యూఐసీఈ)లో 30 వేల మందికి టీకాకు అయ్యే ఖర్చును భరించేందుకు సిద్ధమని ఆ ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. సినీ కార్మికులకు వెంటనే వాక్సిన్ డ్రైవ్‌ను నిర్వహించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు యష్‌రాజ్ సంస్థ లేఖలో విన్నవించుకుంది.
"సుమారు 30 వేల మంది సినీ కార్మికులకు వ్యాక్సిన్లు అందించమని మా యష్‌రాజ్ ఫిల్మ్ సంస్థ తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌ను సరైన రీతిలో నిర్వహించేందుకు మా సహకారాన్ని అందిస్తాం. టీకాలు వేసుకున్న తర్వాత సినీ కార్మికులంతా వారివారి కార్యాకలాపలకు కొనసాగించొచ్చని ఆశిస్తున్నాము".