తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా భార్యని ఎలా చూసుకున్నానో అందరికీ తెలుసు' - యో యో హనీసింగ్‌ వార్తలు

తనపై వచ్చిన గృహహింస ఆరోపణలపై పాప్‌ సింగర్‌ యో యో హనీసింగ్‌ స్పందించారు. తన భార్య షాలిని కావాలనే ఆరోపణలు చేస్తోందన్నారు. తన భార్యను ఎంత బాగా చూసుకునే వాడినో, ఆమెతో తన అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలుసన్నారు.

honey singh
హనీసింగ్‌

By

Published : Aug 7, 2021, 6:42 PM IST

తన సతీమణి షాలిని చేసిన గృహహింస ఆరోపణలపై పాప్‌ సింగర్‌ యో యో హనీ సింగ్‌ ఎట్టకేలకు పెదవి విప్పారు. షాలిని కావాలనే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా సోషల్‌మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ చేశారు.

అందరికీ తెలుసు..

'సుమారు 20 సంవత్సరాల నుంచి నాతో కలిసి ఉన్న షాలిని నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం పట్ల నేనెంతో బాధపడుతున్నా. ఎన్నో సందర్భాల్లో నా పాటలపై విమర్శలు, నా ఆరోగ్యంపై వదంతులు వచ్చాయి. ఇప్పటివరకూ వాటి గురించి నేను పెద్దగా స్పందించలేదు. కానీ ఈ సారి, నా కుటుంబసభ్యులపై షాలిని చేసిన తీవ్ర ఆరోపణలను ఖండించడానికే వివరణ ఇస్తున్నాను. నా భార్యను నేను ఎంత బాగా చూసుకునే వాడినో, ఆమెతో నా అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలుసు. ఎందుకంటే గత దశాబ్దం కాలంగా ఆమె కూడా నా బృందంలో సభ్యురాలే. నాతో పాటు షూట్లు, ఈవెంట్లకు తనూ వచ్చేది. తను కావాలనే ఈ విధమైన ఆరోపణలు చేస్తోంది. నేను తనని ఎప్పుడూ వేధింపులకు గురి చేయలేదు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున ఇంతకు మించి నేను ఏం మాట్లాడదలచుకోలేదు. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను' అని హనీ సింగ్‌ రాసుకొచ్చారు.

సుమారు పదేళ్లపాటు ప్రేమలో ఉన్న హనీసింగ్‌-షాలిని 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే వివాహామానంతరం వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. హనీసింగ్‌ తనని మానసికంగా, శారరీకంగా వేధిస్తున్నాడంటూ తాజాగా ఆమె దిల్లీ కోర్టును ఆశ్రయించారు.

హనీసింగ్‌ తండ్రి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. షాలిని ఆరోపణలపై ఆగస్టు 28 లోపు స్పందించాలని కోర్టు హనీసింగ్‌ను ఆదేశించింది.

ఇదీ చదవండి:Raj Kundra: 'అతడు తప్పుడు పనులు చేయిస్తాడనుకోలేదు'

ABOUT THE AUTHOR

...view details