తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాస్టార్​కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ - pawan kalyan

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈరోజు. సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో మెగాస్టార్​పై ఉన్న ప్రేమను తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చిరు

By

Published : Aug 22, 2019, 12:56 PM IST

Updated : Sep 27, 2019, 9:05 PM IST

మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులతో పాటు పలువురు బర్త్​డే విషెస్​ తెలుపుతున్నారు. మెగాస్టార్ సోదరుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే అన్నయ్యపై ఉన్న ప్రేమను ప్రత్యేక లేఖ ద్వారా తెలపగా.. మెగా హీరోలు రామ్​చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్​ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్​ చిరుకు తనదైన శైలిలో పుట్టినరోజు విషెస్​ తెలిపాడు.

"నాతో పాటు మిలియన్ల మందికి మీరు స్ఫూర్తి, గురువు, మార్గనిర్దేశకుడివి. వారందరూ మిమ్మల్ని మెగాస్టార్ అని పిలుస్తారు. నేను అప్పా అని పిలుస్తా. పుట్టినరోజు శుభాకాంక్షలు అప్పా. ఇదేవిధంగా మా అందరికి స్ఫూర్తి కలిగిస్తూ ఉండాలి".
-రామ్ చరణ్​, మెగా హీరో

రామ్​ చరణ్​ విషెస్

"నా జీవితంలోని మెగాస్టార్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఒక హీరోనే కాదు అంతకుమంచి మంచి వ్యక్తి. నేను చూసిన వ్యక్తుల్లో వినయపూర్వకమైన వ్యక్తి మీరు. మీ నుంచి ఎంతో నేర్చుకున్నా.. ఇంకా నేర్చుకుంటున్నా".
-అల్లు అర్జున్, హీరో

"మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ద్వారా సినిమాల్లోకి రావడం నా అదృష్టం".
-సాయి ధరమ్​ తేజ్, హీరో

పుట్టినరోజు శుభాకాంక్షలు మెగాస్టార్. నా సంతోషం, స్ఫూర్తి మీరు. లవ్ యూ డాడీ
-వరుణ్​ తేజ్, మెగా హీరో

"నా హీరో, నా ధైర్యం, నా నమ్మకం, నా గురువైన నాన్నకు జన్మదిన శుభాకాంక్షలు. స్ఫూర్తికి మారుపేరు మీరు".
-సుస్మిత కొణిదెల, చిరంజీవి కూతురు

సుస్మిత ట్వీట్

"మీరు సూర్యుడు వైపు నడవండి.. మీ నీడ లాగా మిమ్మల్ని ఫాలో అవుతాం. మా అందరికీ మీరే గొప్ప స్ఫూర్తి. మీరు ఎల్లపూడూ మా మెగాస్టార్".
-కౌశల్ మండ, బిగ్​ బాస్ 2 విజేత

కౌశల్ మండ ట్వీట్

"పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి. అమితమైన సంతోషాలు మీకు కలగాలని కోరుకుంటున్నా".
-రాధికా శరత్​కుమార్, హీరోయిన్

రాధిక ట్వీట్

పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి. మీరు కోరుకున్నవి అన్ని మీకు దక్కాలి. సైరా నరసింహారెడ్డి విజయవంతమవ్వాలని కోరుకుంటున్నా.
-సుమలత అంబరీష్, హీరోయిన్

సుమలత ట్వీట్

"మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ చేయి ఇంకా రఫ్​గానే ఉంది. 'సైరా'తో మళ్లీ రఫ్​ ఆడించేయండి".
-మంచు మనోజ్, నటుడు

మంచు మనోజ్ ట్వీట్

"వివాదాలకు తావు లేని తెలుగు సినిమా రాజు మెగాస్టార్ చిరంజీవి. మీతో పని చేయడం గౌరవంగా భావిస్తున్నా. మీరు తెరపై కనిపించే విధానం మరెవరికి సాధ్యం కాదు".
-సురేందర్ రెడ్డి, సైరా దర్శకుడు

సురేందర్ రెడ్డి ట్వీట్

కొబ్బరిమట్ట నిర్మాత సాయి రాజేశ్.. మెగాస్టార్​పై ఉన్న అభిమానాన్ని తనదైన శైలిలో చాటుకున్నాడు. ప్రత్యేఖ లేఖ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

దేవీ శ్రీ ప్రసాద్, చిరంజీవి కాంబినేషన్‌లోని పాపులర్‌ సాంగ్‌ శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ పాటతో సైరా సరసింహారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు డీఎస్​పీ.

ఇవీ చూడండి.. పునాది రాళ్లు నుంచి సైరా వరకు తగ్గని 'మెగా' జోరు

Last Updated : Sep 27, 2019, 9:05 PM IST

ABOUT THE AUTHOR

...view details