తమిళ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టానంటూ బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని మరక్కణంకు చెందిన భువనేశ్వరన్గా గుర్తించారు. అతడు గతంలో.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ సీఎం పళనిస్వామి, సూపర్‌స్టార్ రజనీకాంత్, హీరోలు కమల్‌హాసన్, అజిత్ ఇళ్లలో బాంబు పెట్టినట్లు బెదిరించాడని పోలీసులు తేల్చారు.
సోమవారం ఉదయం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. డాక్ స్క్వాడ్‌తో విజయ్ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు ఏం లేకపోవడం వల్ల అది ఫేక్ కాల్ అని గుర్తించారు.